MLC Kavitha : కేసీఆర్ ను ఓడించాలంటే కేసీఆరే పుట్టాలి

ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కామెంట్స్

MLC Kavitha : హైద‌రాబాద్ – ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌తిప‌క్షాలు త‌న తండ్రిని టార్గెట్ చేశాయ‌ని, కానీ ద‌మ్మున్న లీడ‌ర్ ను ఢీకొనే స‌త్తా ఆ పార్టీల‌కు లేనే లేద‌న్నారు. శుక్ర‌వారం క‌ల్వ‌కుంట్ల క‌విత మీడియాతో మాట్లాడారు.

MLC Kavitha C0mments

త‌న తండ్రి లేక పోతే ,పోరాటం గ‌నుక చేయ‌క పోయి ఉంటే ఇవాళ తెలంగాణ వ‌చ్చేదా అని ప్ర‌శ్నించారు. ఆనాడు ఉద్య‌మం జ‌రిగిన స‌మ‌యంలో ఎవ‌రు ఎక్క‌డ ఉన్నారో నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జ‌ల‌కు తెలుస‌న్నారు. ఎన్ని వ్యూహాలు ప‌న్నినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా గులాబీ జెండా రెప రెప లాడ‌డం ఖాయ‌మ‌న్నారు క‌విత‌.

ఆయ‌న‌ను ఓడించాలంటే మ‌ళ్లీ కేసీఆర్ మాత్ర‌మే పుట్టాల‌ని స్ప‌ష్టం చేశారు ఎమ్మెల్సీ. నిరుద్యోగుల‌కు త‌మ స‌ర్కార్ అన్యాయం చేయ‌లేద‌న్నారు. ల‌క్ష‌న్న‌రకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘ‌న‌త త‌మ స‌ర్కార్ ద‌ని పేర్కొన్నార‌. ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌లలో వాస్త‌వం లేద‌న్నారు.

బ్లాక్ మెయిల్ రాజ‌కీయాలు తెలంగాణ‌లో చెల్ల‌వ‌న్నారు. ఈ విష‌యం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకుంటే మంచిద‌న్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న వాళ్లు బీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని, బాస్ సీఎం కేసీఆర్ ను విమ‌ర్శించే నైతిక హ‌క్కు లేద‌న్నారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌(MLC Kavitha). ఇక‌నైనా తాము ఎవ‌రితో మాట్లాడుతున్నామో తెలుసుకుని కామెంట్స్ చేయాల‌ని సూచించారు.

Also Read : Telangana Election Commission : గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల

Leave A Reply

Your Email Id will not be published!