Bhatti Vikramarka : కేసీఆర్ మోసం తెలంగాణకు ద్రోహం
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
Bhatti Vikramarka : హైదరాబాద్ – మాయ మాటలతో మోసం చేయడం తప్ప సీఎం కేసీఆర్ చేసింది ఏమీ లేదని నిప్పులు చెరిగారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన పూర్తిగా గాడి తప్పిందన్నారు. గత ఎన్నికల సమయంలో దళితుడిని సీఎం చేస్తానని చెప్పాడని, కానీ తానే కుర్చీపై కూర్చున్నాడని ఆరోపించారు.
Bhatti Vikramarka Slams CM KCR
కేసీఆర్ బలహీన వర్గాలను, సంబండ వర్ణాలను పూర్తిగా నమ్మించి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. కలల ప్రపంచం చూపించాడని కానీ కేసీఆర్ చేసిన ద్రోహాన్ని ప్రజలు మరిచి పోలేరని పేర్కొన్నారు. దళితులకు ఇస్తామన్న మూడు ఎకరాల పంపిణీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటి వరకు దళిత బంధు ఇవ్వలేదని మండిపడ్డారు.
నమ్మించి మోసం చేయడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుండడం బాధాకరమని పేర్కొన్నారు. రాజ్యాధికారం కోసం ప్రజల జీవితాలతో ఆటాడుకుంటున్నాడని ధ్వజమెత్తారు మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka).
తమ పార్టీ తీసుకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను ఇప్పటి వరకు అమలు చేయడం లేదంటూ ఫైర్ అయ్యారు. ఎవరూ తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ సూచించారు. తాము పవర్ లోకి వస్తామని మిమ్మల్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Also Read : Padi Kaushik Reddy : నన్ను గెలిపిస్తే రిసార్ట్ ఏర్పాటు చేస్తా