PAK vs NZ ICC World Cup : వరించిన అదృష్టం ఆశలు సజీవం
సెమీస్ రేసులో పాకిస్తాన్ టీం
PAK vs NZ ICC World Cup : అదృష్టం తలుపు తడితే ఎవరూ అడ్డుకోలేరని తేలి పోయింది పాకిస్తాన్ జట్టు విషయంలో. భారత్ లో బీసీసీఐ ఆధ్వర్యంలో ఐసీసీ(ICC) వన్డే వరల్డ్ కప్ 2023 కొనసాగుతోంది. ఆఫ్గనిస్తాన్ తో అనూహ్యంగా ఓటమి పాలై సెమీస్ ఆశలు సంక్లిష్టం చేసుకున్న ఆ జట్టుకు ఉన్నట్టుండి వాన రూపంలో లక్ కలిసొచ్చింది.
PAK vs NZ ICC World Cup Updates
సెమీ ఫైనల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఉన్నట్టుండి వాన దేవుడు తోడయ్యాడు. దీంతో నాలుగో మ్యాచ్ లో గెలుపొందింది. 21 రన్స్ తేడాతో కీవీస్ ను ఓడించింది. డక్ వర్త్ లూయిస్ రూల్ పాక్ పాలిట వరంగా మారింది.
విచిత్రం ఏమిటంటే ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టు భారీ స్కోర్ ను సాధించింది. ఊహించని రీతిలో ఏకంగా 401 రన్స్ చేసింది. కేవలం ఆరు వికెట్లు కోల్పోయింది. మరోసారి వరల్డ్ కప్ లో రచిన్ రవీంద్ర సెన్సేషన్ క్రియేట్ చేశాడు. వరుసగా ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం.
వర్షం రావడంతో తక్కువ టార్గెట్ విధించారు. టార్గెట్ ఛేదనలో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఓపెనర్ జమాన్ అద్భుతంగా ఆడాడు. ఇక కీవీస్ జట్టులో రచిన్ రవీంద్ర, విలియమ్సన్ దంచి కొట్టారు. మొత్తంగా బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్ అత్యంత ఆసక్తిని రేపింది. దీంతో పాకిస్తాన్ నాలుగో స్థానానికి చేరుకుంది.
Also Read : Vijay Sai Reddy : పురందేశ్వరిపై విజయ సాయి ఫైర్