IND vs SA ODI World Cup : వరల్డ్ కప్ లో భారత్ జైత్రయాత్ర
వరుసగా ఎనిమిదో మ్యాచ్ లో విక్టరీ
IND vs SA ODI World Cup : బీసీసీఐ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఐసీసీ(ICC) వన్డే వరల్డ్ కప్ 2023లో రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ లలో విజయం సాధించింది. తాజాగా జరిగిన కీలక పోరులో బలమైన దక్షిణాఫ్రికా జట్లు సెన్సేషన్ విక్టరీ నమోదు చేసింది.
IND vs SA ODI World Cup Updates
రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ సాధించాడు. తన కెరీర్ లో వన్డే పరంగా సచిన్ టెండూల్కర్ సరసన నిలిచాడు. అతడితో పాటు అయ్యర్ , రోహిత్ మెరుగైన ఆట తీరు కనబర్చారు. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో 243 రన్స్ తేడాతో గెలుపొందింది.
ఈ మెగా టోర్నీలో కంటిన్యూగా మ్యాచ్ లు గెలుపొందుతూ సత్తా చాటింది టీమిండియా. ఈడెన్ గార్డెన్ లో భారత్ అటు బ్యాట్ తో పరుగుల వరద పారించింది. ఇటు బౌలింగ్ తో వికెట్లు కూల్చింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 326 రన్స్ చేసింది.
అనంతరం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్ తగిలింది. రవీంద్ర జడేతా తన బౌలింగ్ తో మ్యాజిక్ చేశాడు. ఏకంగా 5 వికెట్లు తీశాడు. సఫారీకి కోలుకోలేని దెబ్బ కొట్టాడు. డికాక్, బవుమా, డసెన్ , మార్క్ , క్లాసెన్ , మిల్లర్, జాన్సన్ ఇలా ప్రతి ఒక్కరూ నిరాశ పరిచారు.
Also Read : Sunil Narine : విండీస్ కు షాక్ నరైన్ గుడ్ బై