Boda Janardhan : తెలంగాణలో శాసన సభ ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి బోడ జనార్దన్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1959లో పుట్టారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో ఉంటున్నారు బోడ జనార్దన్.
Boda Janardhan Resigned from Congress
నాలుగు సార్లు శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. కేబినెట్ లో కొలువు తీరారు. 1985లో తెలుగుదేశం పార్టీలో చేరారు. చెన్నూరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1989లో మరోసారి గెలుపొందాడు. ఆనాటి టీడీపీ సీఎం ఎన్టీఆర్ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు బోడ జనార్దన్.
ఇదే సమయంలో 1994లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంజీవ రావుపై , 1999లో జి. వినోద్ కుమార్ పై విక్టరీ సాధించాడు . 2004లో జరిగిన ఎన్నికల్లో జి. వినోద్ పై ఓటమి పాలయ్యాడు. 2011లో వైఎస్సార్ పార్టీలో చేరారు. ఆ పార్టీకి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా పని చేశాడు. ఆ పార్టీకి రాజీనామా చేసి తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు.
బోడ జనార్దన్(Boda Janardhan) 2013లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కలేదు. 2019లో బీజేపీ లో చేరాడు. ప్రస్తుతం ఆ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ కండువా కప్పుకోనున్నారు. సో ఈయన ఇప్పటి వరకు మారని పార్టీ అంటూ లేదు.
Also Read : Kumara Swamy : డీకేకు కుమార బంపర్ ఆఫర్