Kumara Swamy : డీకేకు కుమార బంప‌ర్ ఆఫ‌ర్

సీఎం కావాల‌ని అనుకుంటే మ‌ద్ద‌తిస్తా

Kumara Swamy : క‌ర్ణాట‌క – క‌న్న‌డ నాట రాజ‌కీయం మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. సీఎం కుర్చీ కోసం కాంగ్రెస్ పార్టీలో ముస‌లం రేగింది. ఒక‌రిని మించి మ‌రొక‌రు తాము సీఎం రేసులో ఉన్నామంటూ ప్ర‌క‌టిస్తూ వ‌చ్చారు. హైక‌మాండ్ దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది. అయినా ఎవ‌రూ త‌గ్గ‌డం లేదు. దీంతో ప్ర‌భుత్వం ఐదేళ్ల పాటు కొన‌సాగుతుందా లేదా అన్న అనుమానం నెల‌కొంది పార్టీ శ్రేణుల్లో

Kumara Swamy Comment

ఇటీవ‌ల రాష్ట్రంలో జ‌రిగిన శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో ఊహించ‌ని రీతిలో భారీ మెజారిటీని కాంగ్రెస్ పార్టీకి క‌ట్ట‌బెట్టారు. నువ్వా నేనా అన్న రీతిలో సాగుతుంద‌ని అనుకున్న త‌రుణంలో ఉన్న‌ట్టుండి క‌న్న‌డ వాసులు హ‌స్తం వైపు మొగ్గు చూపారు. క‌మ‌లానికి కోలుకోలేని షాక్ ఇచ్చారు.

ఈ త‌రుణంలో ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందిన డికే శివ‌కుమార్ సీఎం పోస్టును కోరుకున్నారు. ఈ త‌రుణంలో సీనియ‌ర్ నాయ‌కుడు, వివాద ర‌హితుడిగా పేరొందిన సిద్ద‌రామ‌య్య‌కు ఛాన్స్ ఇచ్చింది హైక‌మాండ్. దీంతో డీకే త‌గ్గాల్సి వ‌చ్చింది. ఆయ‌న‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది.

ప్ర‌స్తుతం సిద్ద‌రామ‌య్య‌, డీకే వ‌ర్గాలుగా చీలి పోయారు. తాజాగా ఏఐసీసీ చీఫ్ ఖ‌ర్గే త‌న‌యుడు ప్రియాంక్ ఖ‌ర్గే కూడా తాను కూడా సీఎం రేసులో ఉన్నానంటూ ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా జేడీఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ సీఎం కుమార స్వామి(Kumara Swamy) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అవ‌స‌ర‌మైతే త‌మ పార్టీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు డీకే శివ‌కుమార్ కు తెలియ చేస్తానంటూ వెల్ల‌డించారు.

Also Read : CJI Shock Comment : సుప్రీం ఆగ్ర‌హం దిగొచ్చిన కేంద్రం

Leave A Reply

Your Email Id will not be published!