Bellaiah Naik : గాంధీ భవన్ లో బెలయ్య నాయక్ దీక్ష
కోడంగల్ సీటు ఇవ్వాలని డిమాండ్
Bellaiah Naik : హైదరాబాద్ – ఎన్నికల వేళ కాంగ్రెస్(Congress) పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితా తీవ్ర గందరగోళానికి దారి తీసింది. పలువురికి టికెట్లు రాక పోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గాంధీ భవన్ ను ముట్టడించే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి టికెట్లను అమ్ముకున్నాడంటూ, పని చేసిన వారికి టికెట్లు రాకుండా చేశాడంటూ ఆరోపించారు.
Bellaiah Naik Issue
మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజ నరసింహకు ప్రధాన అనుచరుడిగా పేరు పొందిన, 20 ఏళ్ల పాటు పార్టీ కోసం పని చేసిన కాట శ్రీనివాస్ గౌడ్ ను కాదని అక్కడ నీలం మధు ముదిరాజ్ కు కేటాయించారు. ఇందుకు సంబంధించి ఆయన భార్య సుధ శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్, జగ్గారెడ్డి కోట్లు తీసుకుని టికెట్ అమ్ముకున్నారంటూ మండిపడ్డారు. ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు గాంధీ భవన్ ను ముట్టడించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ జాతీయ ఎస్టీ సెల్ చైర్మన్ గా ఉన్న , ప్రముఖ ఉద్యమకారుడు బెల్లయ్య నాయక్ తనకు టికెట్ రాక పోవడంతో గాంధీ భవన్ ముందు నిరాహారదీక్ష చేపట్టారు.
మహబూబాబాద్, ఇల్లందు, డోర్నకల్ వీటిలో ఎక్కడైనా తనకు టికెట్ ఇవ్వాలని అడిగితే ఇవ్వలేదని కోడంగల్ సీటు తనకు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
Also Read : MLC Kavitha Checking : ఎమ్మెల్సీ కవిత వాహనం తనిఖీ