Asaduddin Owaisi : హైదరాబాద్ – ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. ఆయన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. కొందరు తెల్ల బట్టలు వేసుకుని అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని వారికి అంత సీన్ లేదంటూ ఎద్దేవా చేశారు.
Asaduddin Owaisi Comment Viral
ఓ జాతీయ మీడియా ఛానల్ నిర్వహించిన చర్చా గోష్టిలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో అంతర్గత మద్దతు తెలిపిన ఎంఐఎం పార్టీ ఈసారి బహిరంగంగానే మద్దతు ప్రకటించారు ఆ పార్టీ బాస్. ఇప్పటి వరకు ఈ దేశంలో కులం, మతం పేరుతో కాంగ్రెస్ , భారతీయ జనతా పార్టీ లు రాజకీయాలు చేశాయని ఆరోపించారు.
కానీ తెలంగాణలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం వచ్చాక ఇలాంటి వాటికి చోటు లేకుండా పోయిందని స్పష్టం చేశారు అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi). అందుకే తాము బేషరతుగా సీఎం కేసీఆర్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపామన్నారు .
దేశంలో ఎక్కడా లేని రీతిలో ఇక్కడ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందన్నారు అసదుద్దీన్ ఓవైసీ. ఈ సందర్బంగా ఆయన కేసీఆర్ ను బాహుబలి లాంటోడంటూ కితాబు ఇచ్చారు.
Also Read : Potturi Vijayalakshmi: ప్రముఖ తెలుగు హస్య కథా రచయిత