Pawan Kalyan Go Back : పవన్ కళ్యాణ్ గో బ్యాక్
- ఓయూ జేఏసీ డిమాండ్
Pawan Kalyan Go Back : హైదరాబాద్ – ఏం ముఖం పెట్టుకుని బీజేపీకి మద్దతు ఇస్తున్నావో చెప్పాలంటూ నిప్పులు చెరిగారు ఓయూ జేఏసీ నేతలు. ప్రముఖ నటుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తెలంగాణ నుంచి వెళ్లి పోవాలంటూ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఉంటూ ఏపీలో రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించారు.
Pawan Kalyan Go Back Comment Viral
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి ఏపీకి మద్దతు ప్రకటించిన ఘనుడు ఈ నటుడు అంటూ ఎద్దేవా చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన భారత రాష్ట్ర సమితి పార్టీకి నిస్సిగ్గుగా మద్దతు పలికిన నీచమైన చరిత్ర పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ది అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఉన్నట్టుండి మరో కొత్త అవతారం ఎత్తారంటూ మండిపడ్డారు. రెండు నాల్కల ధోరణి మానుకోవాలని , అయినా పవన్ కళ్యాణ్ కు ఇక్కడ ఉండే అర్హత లేదని హెచ్చరించారు ఓయూ జేఏసీ నేతలు.
తెలంగాణలో నిట్ట నిలువునా దోపిడీకి పాల్పడి, లక్ష కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్ కు మద్దతు ఇస్తున్నాడని, ఇక దేశంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన బీజేపీకి బేషరతు మద్దతు పలకడం దారుణమన్నారు.
Also Read : Katyayani Vidmahe: అభ్యుదయ రచయిత్రి కాత్యాయనీ విద్మహే