PM Modi : మందకృష్ణకు మోదీ కితాబు
తన జాతి కోసం చేసిన కృషి భేష్
PM Modi : సికింద్రాబాద్ – ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం మాదిగలకు అండగా ఉంటుందన్నారు. ఎస్సీల వర్గీకరణకు కట్టుబడి ఉంటామని అన్నారు. తన జాతి కోసం మంద కృష్ణ చేసిన కృషికి తాను నమస్కరిస్తున్నానని స్పష్టం చేశారు మోదీ.
PM Modi Comment
తన కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మాదిగ జాతికి, సోదర, సోదరీమణులకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని తెలిపారు. ఇవాళ జరిగిన మాదిగ విశ్వ రూప మహాసభను తన జీవితంలో మరిచి పోలేనని పేర్కొన్నారు నరేంద్ర మోదీ(PM Modi).
నా పట్ల దళిత సోదర సోదరీమణుల ప్రేమాభిమానులు అపారమైనవని కొనియాడారు. ఈ సభను ఇంత అద్భుతంగా నిర్వహించడమే కాకుండా సక్సెస్ చేసినందుకు ప్రత్యేకించి నా సోదరుడు మందకృష్ణ మాదిగను అభినందిస్తున్నానని అన్నారు.
ఒకటా రెండా ఏకంగా 30 ఏళ్ల పాటు తన జాతి కోసం చేసిన ప్రయత్నం, పోరాటం అద్భుతమని ఇలాంటి వ్యక్తిని తాను చూసి ఆశ్చర్యానికి లోనవుతున్నానని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఎస్సీల వర్గీకరణకు సంబంధించి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇది త్వరలోనే సాధ్యమవుతుందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు ప్రధాన మంత్రి.
Also Read : TS Nominations : 119 నియోజకవర్గాలు 4,798 నామినేషన్లు