Revanth Reddy : క్రిష్టియన్ల సంక్షేమం కాంగ్రెస్ లక్ష్యం
స్పష్టం చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Revanth Reddy : సికింద్రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో క్రిష్టియన్ల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ లో జరిగిన తెలంగాణ క్రిస్టియన్ కమ్యూనిటీ డిక్లరేషన్ ఫర్ పొలిటికల్ పార్టీస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే పాల్గొన్నారు.
Revanth Reddy Comment on Christian Welfare
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రసంగించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పాటైన బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాలుగా దోపిడీకి, అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. క్రిష్టియన్లు, మైనార్టీలు, వివిధ సామాజిక వర్గాలకు సంక్షేమ పథకాల బూచి చూపి కేసీఆర్ మోసం చేశాడని మండిపడ్డారు.
ప్రస్తుతం జరుగనున్న శాసన సభ ఎన్నికలు అత్యంత ముఖ్యమని, ఈసారి ప్రజలు మార్పు కోరుతున్నారని రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు రేవంత్ రెడ్డి. తాము పవర్ లోకి వచ్చిన వెంటనే క్రిష్టియన్ల సంక్షేమం కోసం పాటు పడతామని హామీ ఇచ్చారు టీపీసీసీ చీఫ్. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
Also Read : Minister KTR : గెలుపు పక్కా గులాబీదే జెండా