SA vs AUS ICC ODI World Cup : ఆసిస్ ఆల్ రౌండ్ షో

భార‌త్ తో ఫైన‌ల్ కు రెఢీ

SA vs AUS ICC ODI World Cup : కొల్ క‌త్తా – ఐసీసీ(ICC) వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో భాగంగా కోల్ క‌త్తా లోని ఈడెన్ గార్డెన్ మైదానంలో జ‌రిగిన కీల‌క పోరులో బ‌ల‌మైన ఆస్ట్రేలియా చివ‌రి దాకా పోరాడి గెలిచింది. టార్గెట్ త‌క్కువ ప‌రుగులైనా గెలుపు కోసం చెమ‌టోడ్చింది. చివ‌రి దాకా నువ్వా నేనా అన్న రీతిలో సాగింది. ఒక రకంగా ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేసిన‌ప్ప‌టికీ ఫీల్డింగ్ లో చేసిన త‌ప్పిదాలే ఆ జ‌ట్టును కొంప ముంచాయి.

SA vs AUS ICC ODI World Cup Updates

ఏకంగా 6 క్యాచ్ లు వ‌దిలేశారు. తొలుత మైదానంలోకి దిగిన సౌతాఫ్రికా జ‌ట్టు 49.4 ఓవ‌ర్ల‌లో 212 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. ఒకానొక ద‌శ‌లో త‌క్కువ ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయింది. ఈ త‌రుణంలో మైదానంలోకి దిగిన డేవిడ్ మిల్ల‌ర్ సెంచ‌రీ తో క‌దం తొక్కాడు . దీంతో గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోరు సాధించింది.

అనంత‌రం 213 ర‌న్స్ ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన ఆస్ట్రేలియా విజ‌యం సాధించేందుకు నానా తంటాలు ప‌డింది. 7 వికెట్ల తేడాతో గెలుపొంది నేరుగా ఫైన‌ల్ కు చేరుకుంది. దీంతో ఈనెల 19న గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ మోదీ స్టేడియంలో ఫైన‌ల్ జ‌ర‌గ‌నుంది.

ఒక ర‌కంగా చెప్పాలంటే తీవ్ర‌మైన ఒత్తిడికి లోనైంది స‌ఫారీ టీం. బ‌వుమా పూర్తిగా ప్లేయ‌ర్ల‌ను వాడుకోవ‌డంలో ఫెయిల్ అయ్యాడు. ఇదిలా ఉండ‌గా ఆస్ట్రేలియా టీం వ‌ర‌ల్డ్ క‌ప్ కు చేరుకోవ‌డం ఇది వ‌రుస‌గా ఎనిమిదోసారి కావ‌డం విశేషం.

ఆసిస్ టీమ్ లో హెడ్ 9 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో 62 ర‌న్స్ చేస్తే స్టీవ్ స్మిత్ 30 , జోష్ ఇంగ్లీష్ 28 , వార్న‌ర్ 29 , స్టార్క్ 16 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.

Also Read: SA vs AUS ICC ODI World Cup : మిల్ల‌ర్ కిల్ల‌ర్ ఇన్నింగ్స్

Leave A Reply

Your Email Id will not be published!