PM Modi : భారత్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వన్డే వరల్డ్ కప్ 2023 ఆఖరి అంకానికి చేరుకుంది. తొలి సెమీస్ లో భారత జట్టు న్యూజిలాండ్ ను 70 పరుగుల తేడాతో ఓడించింది. నేరుగా ఫైనల్ కు చేరుకుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఇప్పటి వరకు టోర్నీలో భాగంగా 9 మ్యాచ్ లు ఆడింది. ఏ ఒక్క మ్యాచ్ ఓడి పోలేదు. అన్ని మ్యాచ్ లను కైవసం చేసుకుని తనకు ఎదురే లేదని చాటింది.
PM Modi Will come to World Cup Final
ఇక కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్ లో జరిగిన రెండో సెమీ ఫైనల్ లో దక్షిణాఫ్రికా ను ఆస్ట్రేలియా జట్టు 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. నేరుగా ఫైనల్ కు చేరుకుంది. దీంతో గత కొన్ని రోజులుగా కొనసాగుతూ వచ్చిన వరల్డ్ కప్ ఈనెల 19తో ముగియనుంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో భారత్ , ఆసిస్ జట్ల మధ్య ఫైనల్ జరగనుంది.
ఈ కీలకమైన పోరుకు దాదాపు లక్ష మందికి పైగా హాజరవుతారని అంచనా. ఇప్పటికే ముఖ్య అతిథిగా భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) హాజరవుతున్నారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. దీంతో పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తోంది.
అంతే కాకుండా భారత ఆర్మీ ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టనుంది.
Also Read : Wazhma Ayoubi : వాజ్మా అయూబీ వైరల్