Rahul Gandhi : వరంగల్ – తెలంగాణ రాష్ట్రంలో కారు పంక్చర్ కావడం ఖాయమని జోష్యం చెప్పారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన పలు నియోజకవర్గాలలో పర్యటించారు. వరంగల్ నగరంలో భారీ ఎత్తున రోడ్ షో చేపట్టారు. పెద్ద ఎత్తున హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగారు.
Rahul Gandhi Comments BRS
కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటూ ప్రశ్నిస్తున్నారని తాను చదువుకున్న బడిని కట్టించింది తామేనని మరిచి పోతే ఎలా అని అన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాదా అని నిలదీశారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రజలను మోసం చేసిన కేసీఆర్ కు పరిపాలన సాగించే నైతిక హక్కు లేదన్నారు. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోందన్నారు. ఎక్కడ చూసినా చేయి గుర్తు కనిపిస్తోందని చెప్పారు.
హైదరాబాద్ లో ఐటీని అభివృద్ది చేసింది, దేశానికి కంప్యూటర్ ను పరిచయం చేసింది తన తండ్రి , దివంగత రాజీవ్ గాంధీ అని ఆ సోయి కూడా లేకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఇంకెన్ని కుట్రలు పన్నినా ప్రజలు దెబ్బ కొట్టడం ఖాయమన్నారు రాహుల్ గాంధీ. ఇకనైనా దొర అహంకారం పోవాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలన్నారు.
Also Read : AP CM YS Jagan : చంద్రబాబు జీవితం అవినీతిమయం