Vijaya Shanti : దొర గడీలు కూలడం ఖాయం
నిప్పులు చెరిగిన రాములమ్మ
Vijaya Shanti : హైదరాబాద్ – ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో కేసీఆర్ దొర గడీలు కూలడం ఖాయమని అన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు , మాజీ ఎంపీ విజయశాంతి. తెలంగాణ కోసం ఎంతో త్యాగం చేశానని స్పష్టం చేశారు. శనివారం గాంధీ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడారు.
Vijaya Shanti Comments on KCR
నిబద్దతతో తాను గత 25 సంవత్సరాల నుంచి పని చేస్తూనే ఉన్నానని చెప్పారు. కేసీఆర్ పై చర్యలు తీసుకుంటారని , ఆయన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపిస్తారని, ఆయన కుటుంబాన్ని జైల్లో వేస్తారని అనుకుని బీజేపీలో చేరానని అన్నారు విజయశాంతి(Vijaya Shanti). కానీ అందుకు విరుద్దంగా ప్రస్తుతం జరుగుతోందన్నారు.
బీజేపీ మాట ఇవ్వడంతో తాను నమ్మి వెళ్లానని, తీరా అక్కడికి వెళ్లాక రాష్ట్రంలో బీజేపీ అన్నది లేదని అది కూడా కేవలం నామ మాత్రమేనని తేలి పోయిందన్నారు. ప్రస్తుతం ఆ పార్టీకి చీఫ్ కిషన్ రెడ్డి అయినా బాస్ మాత్రం కేసీఆర్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు విజయ శాంతి.
నెలలు గడుస్తున్నా ఎలాంటి స్పందన లేదన్నారు. బీజేపీ పార్టీ చీఫ్ ను మార్చడమే ఆ పార్టీ చేసిన పెద్ద తప్పు అని పేర్కొన్నారు. కార్యకర్తలను, ఉద్యమకారులను నమ్మించి మోసం చేసిందన్నారు. గత నాలుగు నెలల నుంచి నేను అసంతృప్తితో ఉన్నానని అన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బేషరతుగా కేసీఆర్ పై యుద్దం చేస్తోందన్నారు. అందుకే తాను తిరిగి తన స్వంత గూటికి రావడం జరిగందన్నారు విజయ శాంతి.
Also Read : Telangana Congress : క్యాంపెయిన్..ప్లానింగ్ కమిటీ రిలీజ్