Ram Charan Sara Tendulkar : చెర్రీ..సారా కాంబోలో మూవీ
సోషల్ మీడియాలో వైరల్
Ram Charan Sara Tendulkar : మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్ , ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు , అందాల ముద్దుగుమ్మ సారా టెండూల్కర్ వైరల్ గా మారారు. ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమాలో నటించనున్నట్లు టాక్. వీరిద్దరి మూవీకి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. ఇదిలా ఉండగా బాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో ఓ చిత్రం ప్లాన్ చేశారట.
Ram Charan Sara Tendulkar Movie
ఈ మూవీలో సచిన్ కూతురు లవ్లీ బ్యూటీ సారా టెండూల్కర్ నటించేందుకు ఒప్పించారని సమాచారం. సచిన్ టెండూల్కర్ స్వయంగా దర్శకుడిని తన కూతురుకు ఛాన్స్ ఇవ్వాలని కోరారని ఇందుకోసం తను కూడా ఒప్పుకున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వార్త హల్ చల్ చేస్తోంది. ఓ వైపు సచిన్ టెండూల్కర్ , సారా టెండూల్కర్ , రామ్ చరణ్(Ram Charan) ,మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా బాలీవుడ్ కు సంబంధించి రాజ్ కుమార్ హిరానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే టేకింగ్ లో , మేకింగ్ లో తనకంటూ ఓ స్పెషాలిటీ ఉంది. మరి చెర్రీ, సారా కాంబినేషన్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.
Also Read : Rahul Gandhi : అదానీ కోసం పని చేస్తున్న మోదీ