Nara Lokesh : ఏపీలో మద్య నిషేధం ఎక్కడ
నిప్పులు చెరిగిన టీడీపీ నేత లోకేష్
Nara Lokesh : అమరావతి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) నిప్పులు చెరిగాడు. ఎన్నికల్లో మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట తప్పారంటూ ఆరోపించారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశాడు.
Nara Lokesh Slams AP CM YS Jagan
ఇవాళ రాష్ట్రంలో పాలన పూర్తిగా అదుపు తప్పిందన్నారు. ఓ వైపు విద్యుత్ ఛార్జీలు పెంచారని, తీరా మద్యం బాబులకు కోలుకోలేని షాక్ ఇచ్చేలా భారీ ఎత్తున ధరలు పెంచి అదనపు భారం మోపారంటూ ఆవేదన వ్యక్తం చేశారు నారా లోకేష్.
తాగుడు మాన్పిస్తామని చెబుతూ మరో వైపు మద్యం రేట్లు ఎలా పెంచుతారంటూ ప్రశ్నించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని పేర్కొన్నారు. మరో వైపు వాయు కాలుష్యం తగ్గించేందుకు చర్యలు తీసుకోలేదన్నారు.
ఏపీలో జగన్ పాలన ప్రజలకు భారంగా మారిందని ఆవేదన చెందారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని త్వరలో జరిగే ఎన్నికల్లో తప్పక షాక్ ఇవ్వక తప్పదన్నారు నారా లోకేష్. తగిన రీతిలో బుద్ది చెప్పేందుకు సిద్దమై పోయారని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
Also Read : JP Nadda : ధరణి పేరుతో కేసీఆర్ భూ దోపిడీ