Vasireddy Seethadevi: సుప్రసిద్ధ తెలుగు నవలా, కథా రచయిత్రి

సుప్రసిద్ధ తెలుగు నవలా, కథా రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి

వాసిరెడ్డి సీతాదేవి

Vasireddy Seethadevi : వాసిరెడ్డి సీతాదేవి (డిసెంబర్ 15, 1933 – ఏప్రిల్ 13, 2007): గుంటూరు జిల్లా చేబ్రోలులో జన్మించిన వాసిరెడ్డి సీతాదేవి సుప్రసిద్ధ తెలుగు నవలా, కథా రచయిత్రిగా గుర్తింపు పొందారు. సీతాదేవి కేవలం ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నప్పటికీ… ప్రైవేటుగా హిందీ ప్రచారక్, ప్రవీణ, సాహిత్య రత్నలో ఉత్తీర్ణత సాధించి తెలుగు, హిందీ భాషలలో ప్రావీణ్యం సంపాదించారు.

Vasireddy Seethadevi – సీతాదేవి రచనా ప్రస్థానం

సీతాదేవి 1950లో సాహిత్య రచన ప్రారంభించి మొదటి నవల ‘జీవితం అంటే’… మొదటి కథ ‘సాంబయ్య పెళ్లి’ రాశారు. ఆ తరువాత మరీచిక, ఉరితాడు, వైతరణి, మృగతృష్ణ, అడవి మల్లె, ఊర్మిళ, బొమ్మరిల్లు, నింగినుండి నేలకు, ప్రతీకారం, తొణికిన స్వప్నం… వంటి 39 నవలలు, వందకు పైగా కథలు రాసారు. నక్సలైట్‌ల నేపథ్యంతో 1982లో సీతాదేవి(Vasireddy Seethadevi) ఎంతో సాహసంతో రచించిన ‘మరీచిక’ అనే నవలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అయితే ఆరుద్ర వంటి ప్రముఖ చరిత్రకారులు సానుకూలంగా స్పందించడంతో హైకోర్టు ఈ నిషేధాన్ని ఎత్తేయడం జరిగింది. ఇక 2000 సంవత్సరంలో ఆమె రాసిన ‘మట్టి మనిషి’ నవలను 14 భాషల్లోకి అనువాదం అయింది. ఐదు సార్లు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ఏకైక రచయిత్రిగా సీతాదేవిగా రికార్డు సృష్టించారు.

సినిమాలుగా సీతాదేవి నవలలు

వాసిరెడ్డి సీతాదేవి రాసిన నవలల్లో కొన్ని సినిమాలుగా నిర్మాణం కాగా, మరికొన్ని నవలలు టీవీ సీరియల్స్‌గా రూపుదిద్దుకున్నాయి. సమత అనే నవల ఆధారంగా ‘ప్రజా నాయకుడు’, ప్రతీకారం అనే నవల ఆధారంగా ‘మనస్సాక్షి’ , మానినీ మనసు ఆధారంగా ‘ఆమె కథ’ చిత్రాల నిర్మాణం జరిగింది. మృగతృష్ణ అనే నవలను ఇదే పేరుతో సినిమాగా నిర్మించడం జరిగింది.

Also Read : Duggirala Gopalakrishnayya: “ఆంధ్ర రత్న” దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

Leave A Reply

Your Email Id will not be published!