Trisha Krishnan : మ‌న్సూర్ కామెంట్స్ త్రిష సీరియ‌స్

చిన్మ‌యి..మాళ‌విక తీవ్ర ఆగ్ర‌హం

Trisha Krishnan : కోలీవుడ్ న‌టుడు మ‌న్సూర్ అలీ ఖాన్ త్రిష గురించి చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఆయ‌న త్రిష‌ను వ్య‌క్తిగ‌తంగా కించ ప‌రిచేలా వ్యాఖ్య‌లు చేయ‌డం తీవ్ర దుమారానికి దారి తీసింది. త్రిష‌తో త‌న‌కు ఓ రేప్ సీన్ అయినా ఉంటుంద‌ని అనుకున్నానంటూ పేర్కొన్నాడు. తీరా లియో సినిమాలో త‌న‌కు ఆ ఛాన్స్ రాకుండా పోయింద‌ని వాపోయాడు.

Trisha Krishnan Serious Reply

లియోలో న‌టుడు జోసెఫ్ విజ‌య్ తో పాటు త్రిష‌(Trisha Krishnan), సంజ‌య్ ద‌త్ న‌టించారు. మ‌న్సూర్ అలీ ఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించాడు. కాశ్మీర్ లో సినిమా షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో త‌న‌కు కూడా ఓ ఛాన్స్ వ‌స్తుంద‌ని ఆశించాన‌ని కానీ దానిని మిస్ అయ్యానంటూ మండిప‌డ్డాడు.

దీనిపై కోలీవుడ్ కు చెందిన ప్ర‌ముఖ సింగ‌ర్ చిన్మ‌యి శ్రీ‌పాద‌, న‌టి మాళ‌విక మోహ‌న్ తీవ్రంగా స్పందించారు. ఇదే స‌మ‌యంలో డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ సైతం మ‌న్సూర్ ఖాన్ కామెంట్స్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఒక మ‌హిళ ప‌ట్ల ఇలా మాట్లాడ‌టం మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించారు. ఇక త్రిష కృష్ణ‌న్ మ‌న్సూర్ పై ఫైర్ అయ్యింది. త‌ను జ‌న్మ‌లో త‌న‌తో న‌టించ‌నంటూ స్ప‌ష్టం చేసింది. మ‌హిళ‌ల ప‌ట్ల ఇంత దిగ‌జారుత‌నంతో , వెకిలిగా మాట్లాడ‌తారా అంటూ మండిప‌డ్డారు.

Also Read : Nagarjuna Networth : నాగార్జున నిక‌ర ఆస్తులు రూ. 3,010 కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!