Minister KTR Viral : హైదరాబాద్ – మంత్రి కేటీఆర్ వైరల్ గా మారారు. ఉద్యోగాల ఊసేది అన్నందుకు నిరుద్యోగులను సన్నాసులంటూ చేసిన కామెంట్స్ పై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. ట్విట్టర్ లో మాత్రమే కనిపించే కేటీఆర్(Minister KTR) ఇలా ఎలా కామెంట్ చేస్తారంటూ మండిపడుతున్నారు.
Minister KTR Viral with His Comments
2 లక్షలకు పైగా ఖాళీగా ఉన్నా ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అవసరం కోసం ఎన్ని మెట్లైనా దిగుతారని, ప్రవల్లిక విషయంలో మాట తూలారని ఆ తర్వాత సర్ది చెప్పే ప్రయత్నం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
యూనివర్శిటీలను నీరు గార్చిన ఘనత మీది కాదా అంటూ ప్రశ్నించారు ట్విట్టర్ వేదికగా ఎన్నారై రాయదాస్ రాయ్ మంతెన. మంగళవారం ఆయన చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. ప్రగతి భవన్ ను కేవలం తమకు మాత్రమే ఉపయోగపడేలా చేశారని ఆరోపించారు.
అంతా అయి పోయాక టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం దోచుకున్న దానిని దాచుకునేందుకు మాత్రమే చేస్తున్న ఈ ప్రయత్నం బెడిసి కొట్టక తప్పదని హెచ్చరించారు.
Also Read : CM KCR : ఇందిరమ్మ రాజ్యం తెలంగాణకు శాపం
