Revanth Reddy Slams : నిరంజ‌న్ రెడ్డిపై రేవంత్ ఫైర్

వంద‌ల కోట్ల భూములు ఎక్క‌డివి

Revanth Reddy : వ‌న‌ప‌ర్తి – సీఎం కేసీఆర్ ను మించి పోయిండు ఆస్తుల సంపాద‌న‌లో అంటూ వ‌న‌ప‌ర్తి ఎమ్మెల్యే, ప్ర‌స్తుత వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి. మంగ‌ళ‌వారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా వ‌న‌ప‌ర్తి పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు.

Revanth Reddy Slams Niranjan Reddy

చిన్నారెడ్డి నిస్వార్థ‌మైన రాజ‌కీయ నాయ‌కుడంటూ కొనియాడారు. ఆయ‌న త‌న‌కు పెద్ద‌న్న లాంటి వ్య‌క్తి అని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ కుటుంబానికి చిన్న‌న్న అత్యంత స‌న్నిహితుడ‌ని తెలిపారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఒక‌నాడు లాయ‌ర్ ప‌ని చేసుకుంటున్న నిరంజ‌న్ రెడ్డికి ఇవాళ వంద‌ల ఎక‌రాలు, ఫామ్ హౌస్ లు, కోట్ల రూపాయ‌లు ఎలా వ‌చ్చాయంటూ నిల‌దీశారు.

ప‌దేళ్ల కేసీఆర్ పాల‌న‌లో తెలంగాణ‌కు ఒరిగింది ఏమీ లేద‌న్నారు. ఇవాళ కొద్దిగా ఓపిక ప‌డితే రాబోయేది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మ‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ మేలు చేకూర్చేలా సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేసి తీరుతామ‌ని స్ప‌ష్టం చేశారు రేవంత్ రెడ్డి.

పంచ క‌ట్టుకున్నంత మాత్రాన నిరంజ‌న్ రెడ్డి లాల్ బ‌హ‌దూర్ శాస్త్రినో లేక రాజ‌శేఖ‌ర్ రెడ్డి అయిపోడంటూ ఎద్దేవా చేశారు. నీళ్ల నిరంజ‌న్ కాదని క‌మీష‌న్ల నిరంజ‌న్ రెడ్డి అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు టీపీసీసీ చీఫ్.

Also Read : Minister KTR Viral : కేటీఆర్ నెట్టింట్లో వైర‌ల్

Leave A Reply

Your Email Id will not be published!