PM Modi : తెలంగాణ – తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొనేందుకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. నవంబర్ 25, 26, 27 తేదీలలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్బంగా బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు.
PM Modi Tour in Telangana
25న మహేశ్వరం, కామారెడ్డి సభల్లో పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పేర్కొంది. 26న తూఫ్రాన్ , నిర్మల్ సభల్లో పాల్గొంటారని తెలిపింది. 27న మహబూబాద్ , కరీంనగర్ జిల్లాలలో జరిగే సభలకు మోడీ హాజరు కానున్నారు.
ఈ సందర్బంగా సభలతో పాటు రోడ్ షోలలో కూడా పాల్గొంటారని స్పష్టం చేసింది బీజేపీ. ఇప్పటికే పలు సభల్లో పాల్గొని ప్రసంగించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో(PM Modi) పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా పాల్గొని ప్రసంగించారు.
ఇందులో భాగంగా ట్రబుల్ షూటర్ ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ మేని ఫెస్టోను విడుదల చేశారు. ఈసారి ఎలాగైనా సరే తాము పవర్ లోకి వస్తామని స్పష్టం చేసింది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్ , బీఆర్ఎస్ అభ్యర్థుల జయాపజయాలను ప్రభావితం చేస్తామని వెల్లడించింది.
Also Read : Congress Dharna: ఎమ్మెల్యే సైదిరెడ్డిపై ఉత్తమ్ ఫైర్