Pawan Kalyan : కమలం గెలుపు అభివృద్దికి మలుపు
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్
Pawan Kalyan : బీజేపీని గెలిపిస్తే అభివృద్ది అన్ని రంగాలలో రాష్ట్రం అభివృద్ది చెందడం ఖాయమని జోష్యం చెప్పారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన బేషరతుగా బీజేపీకి మద్దతు ఇస్తున్నారు.
Pawan Kalyan Comment
వరంగల్ లో జరిగిన సభలో ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సమయ భావం వల్ల ఎక్కువ నియోజకవర్గాలు తిరగలేక పోతున్నానని చెప్పారు. ఎక్కడైతే బీజేపీ అభ్యర్థులు ఉన్నారో అక్కడ జనసేన శ్రేణులు మద్దతు ఇవ్వాలని కోరారు. జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట బీజేపీ నేతలు, కార్యకర్తలు సపోర్ట్ చేయాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్.
ఏ మార్పు కోసం బిడ్డలు బలిదానాలు చేశారో వాటిని సాధించి తీరుతామన్నారు. ఆంధ్రాలో పర్యటించినట్లే తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తానని స్పష్టం చేశారు. ఇంత కాలం పాటు దళితుడిని సీఎంగా చూడలేక పోయామన్నారు. కానీ ఈసారైనా ఎన్నికల్లో బీసీనైనా సీఎంగా ఎన్నుకునే ప్రయత్నం చేయాలన్నారు.
గతంలో ఎన్నడూ లేనంతటి అభివృద్ది బీజేపీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ది చెందుతోందన్నారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). ప్రజల కోసం , తెలంగాణ రాష్ట్ర బాగు కోసం తాను బీజేపీకి మద్దతు ఇస్తున్నానని ప్రకటించారు జనసేన పార్టీ చీఫ్.
Also Read : Asaduddin Owaisi : దొరను గెలిపిస్తే బెటర్ – ఓవైసీ
