Sitaram Yechuri : క‌మ‌లం..కారు రెండూ ఒక్క‌టే

=సీపీఎం సీనియ‌ర్ నేత ఏచూరి

Sitaram Yechuri  : హైద‌రాబాద్ – పేరుకు వేర్వేరు పార్టీలు అయిన‌ప్ప‌టికీ ఆచ‌ర‌ణ‌లో బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్క‌టేన‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీపీఎం సీనియ‌ర్ నాయ‌కుడు సీతారం ఏచూరి. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ కు ఓటు వేయాల‌ని పిలుపునిచ్చారు. తాము పోటీ చేయ‌ని చోట ఆ పార్టీకి త‌ప్ప‌కుండా స‌పోర్ట్ చేయాల‌ని కోరారు.

Sitaram Yechuri Comment

ఒక‌వేళ తెలంగాణ‌లో హంగ్ గ‌నుక వ‌స్తే కమ‌లం, కారు రెండూ ఒక్క‌ట‌వుతాయ‌ని , తిరిగి అధికారంలోకి వ‌స్తాయ‌ని అందుకే వారిని బొంద పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు సీతారాం ఏచూరి(Sitaram Yechuri). తాము బీఆర్ఎస్ , బీజేపీకి పూర్తి వ్య‌తిరేక‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

రేపు జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మి ప్ర‌త్యామ్నాయం కాబోతోంద‌న్నారు. బీజేపీ మోదీ పాల‌న‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని చెప్పారు. బీజేపీకి తాము యాంటీ టీమ్ గా ఉంటామ‌ని అన్నారు.

ఎన్నిక‌లు జ‌రుగుతున్న అన్ని రాష్ట్రాల‌లో త‌మ‌ది ఇదే నినాద‌మ‌ని పేర్కొన్నారు సీతారాం ఏచూర‌. మ‌ధ్య‌ప్ర‌దేశ్, ఛ‌త్తీస్ గ‌ఢ్ , రాజ‌స్థాన్ , తెలంగాణ రాష్ట్రాల‌లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు సీతారాం ఏచూరి.

Also Read : Yogi Adityanath : బీఆర్ఎస్ స‌ర్కార్ బేకార్

Leave A Reply

Your Email Id will not be published!