Rahul Gandhi : కొలువుల భ‌ర్తీకి క‌ట్టుబ‌డి ఉన్నాం

స్ప‌ష్టం చేసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi : హైద‌రాబాద్ – పార్టీ ప‌రంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌ను ప‌క్కాగా అమ‌లు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు ఏఐసీసీ మాజీ చీఫ్‌, ఎంపీ రాహుల్ గాంధీ. ట్విట్ట‌ర్ వేదిక‌గా మంగ‌ళ‌వారం ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నీళ్లు, నిధులు, నియామ‌కాల ట్యాగ్ లైన్ పేరుతో సాధించుకున్న తెలంగాణ‌లో ఒకే కుటుంబం మాత్ర‌మే లాభ ప‌డింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికే ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న ఘ‌న‌త త‌న త‌ల్లి సోనియా గాంధీకి ఉంద‌న్నారు.

Rahul Gandhi Comment about Unemployment

ఇదే స‌మ‌యంలో క‌ర్ణాట‌క‌లో తాము చెప్పిన విధంగానే 5 గ్యారెంటీల‌ను అమ‌లు చేయ‌డం జ‌రుగుతోంద‌ని తెలిపారు. బీఆర్ఎస్ స‌ర్కార్ నిర్వాకం కార‌ణంగా రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర ఇక్క‌ట్ల‌కు గుర‌య్యార‌ని పేర్కొన్నారు.

తాము చెప్పిన విధంగానే జాబ్ క్యాలెండ‌ర్ ను అమ‌లు చేసి తీరుతామ‌ని స్ప‌ష్టం చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. తెలంగాణ‌కు చెందిన యువ‌తకు పూర్తి భ‌రోసా ఇస్తున్నామ‌ని పేర్కొన్నారు. నిరుద్యోగులకు మేలు చేకూర్చేలా నిరుద్యోగ భృతితో పాటు జాబ్స్ కూడా భ‌ర్తీ చేస్తామ‌ని తెలిపారు.

రాష్ట్రంలో బిశ్వాల్ క‌మిటీ నివేదిక ప్ర‌కారం 2 ల‌క్ష‌ల‌కు పైగా ఖాళీలు ఉన్నాయ‌ని వాటిని ద‌శ‌ల వారీగా ఇప్ప‌టికే నిర్ణ‌యించిన తేదీల మేర‌కు భ‌ర్తీ చేసి తీరుతామ‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : K Keshava Rao : కేకే షాకింగ్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!