BRS Win Again : సీఎన్డీపీ స‌ర్వేలో గులాబీదే హ‌వా

119 సీట్ల‌లో బీఆర్ఎస్ కు 83 సీట్లు ప‌క్కా

BRS Win Again : హైద‌రాబాద్ – తెలంగాణ‌లో ఎన్నిక‌లు ఆఖ‌రు అంకానికి చేరుకున్నాయి. పోలింగ్ జ‌రిగేందుకు ఇంకా కొన్ని గంట‌లు మాత్ర‌మే ఉన్నాయి. ఇప్ప‌టికే ప‌లు సంస్థ‌లు ఇబ్బ‌డి ముబ్బ‌డిగా కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ అధికారంలోకి వ‌స్తాయ‌ని పేర్కొన్నాయి. మ‌రో వైపు బీజేపీ, ఎంఐఎం పార్టీలు కీల‌క‌మైన పాత్ర పోషించ‌నున్నాయ‌ని జోష్యం చెప్పారు.

BRS Win Again – Surveys Reports

మొత్తం 119 సీట్ల‌కు గాను ఏకంగా భార‌త రాష్ట్ర స‌మితి(BRS) మ‌రోసారి హ్యాట్రిక్ కొట్టనుంద‌ని ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌ని పేర్కొంది. 83 సీట్ల‌లో గులాబీ విజ‌య కేత‌నం ఎగుర వేయ‌నుంద‌ని స్ప‌ష్టం చేసింది సీఎన్డీపీ సంస్థ‌.

ఇదిలా ఉండ‌గా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప‌దే ప‌దే చెబుతున్న‌ట్లు 80 సీట్లు రావంటూ షాక్ ఇచ్చింది స‌ద‌రు సంస్థ‌. ఆ పార్టీకి కేవ‌లం 27 సీట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని వెల్ల‌డించింది. ఇక భార‌తీయ జ‌న‌తా పార్టీకి కేవ‌లం 2 సీట్లకే ప‌రిమితం కాబోతోంద‌ని పేర్కొంది. అయితే బ‌ల‌మైన సామాజిక ఓటు బ్యాంకు క‌లిగిన హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ నేతృత్వంలోని ఎంఐఎం క్లీన్ స్వీప్ చేయ‌బోతోంద‌ని తెలిపింది.

అయితే ఆ పార్టీ 9 సీట్ల‌లో పోటీ చేస్తోంద‌ని కానీ ఆ పార్టీకి గ‌తంలో ఉన్న సీట్ల‌ను కొద్దిపాటి తేడాతో గెల‌వ‌నుంద‌ని పేర్కొంది.

Also Read : JP Nadda : మోదీ పాల‌న దేశానికి ఆలంబ‌న

Leave A Reply

Your Email Id will not be published!