Bhatti Vikramarka : ప్ర‌జా తీర్పు మా వైపే – భ‌ట్టి

సీఎల్పీ చీఫ్ షాకింగ్ కామెంట్స్

Bhatti Vikramarka : ఖ‌మ్మం జిల్లా – సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క(Bhatti Vikramarka) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జా తీర్పు స్ప‌ష్టంగా ఉంద‌ని పేర్కొన్నారు. ఆయ‌న సీఎం రేసులో ఉన్నారు. గురువారం పోలింగ్ సంద‌ర్బంగా త‌న కుటుంబంతో క‌లిసి ఓటు వేశారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పేరుతో అధికారంలోకి వ‌చ్చిన బీఆర్ఎస్ త‌న అధికారాన్ని కోల్పోవ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.

Bhatti Vikramarka Comment

పార్టీల కంటే ముందు జ‌నం పూర్తిగా ఈ స‌ర్కార్ ను భ‌రించ లేమ‌ని నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని అన్నారు. ప్రతి చోటా స్వ‌చ్ఛందంగా ప్ర‌జ‌లు ఓటు వేసేందుకు త‌ర‌లి వ‌చ్చార‌ని ఈ వేవ్ ను ఏ శ‌క్తి , ఏ పార్టీ అడ్డు కోలేదని స్ప‌ష్టం చేశారు.

త‌న‌కు వ‌చ్చిన స‌మాచారం మేర‌కు 119 నియోజ‌క‌వ‌ర్గాల‌లో క‌నీసం 78 నుంచి 80 సీట్ల‌కు పైగానే కాంగ్రెస్ పార్టీకి రానున్నాయ‌ని పేర్కొన్నారు. ప్ర‌తి చోటా ప్ర‌జ‌లు స్వ‌చ్చంధంగా పోలింగ్ బూత్ ల వ‌ద్ద‌కు వ‌చ్చి ఓట్లు వేయ‌డం ప్ర‌జాస్వామ్యానికి, ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు.

డిసెంబ‌ర్ 3న కాంగ్రెస్ పార్టీ ప్ర‌మాణ స్వీకారం చేస్తుంద‌ని, ఇప్ప‌టికే లాల్ బ‌హ‌దూర్ స్టేడియం వేదిక‌ను తాము ఎంపిక చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. తాము ప్ర‌క‌టించిన విధంగా ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేసి తీరుతామ‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Bandi Sanjay : కేసీఆర్ ఇక మాజీ సీఎం

Leave A Reply

Your Email Id will not be published!