Exit Polls Comment : తెలంగాణం ‘హ‌స్తం’ వ‌శం

ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ విజ‌యం

Exit Polls : యావ‌త్ నాలుగున్న‌ర కోట్ల మంది ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. ఏం జ‌రుగుతుందోన‌ని అంచ‌నా వేస్తున్నారు. ఎప్ప‌టికైనా ఎన్నిక‌లు ముగిశాక ఎగ్జిట్ పోల్స్ ఆయా సంస్థ‌లు ప్ర‌క‌టించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్(EC) సాయంత్రం 5.30 గంట‌ల త‌ర్వాత వెల్ల‌డించేందుకు అనుమ‌తి ఇచ్చింది. ఏకంగా ఒక‌టి రెండు త‌ప్ప మొత్తం 10కి పైగా స‌ర్వే సంస్థ‌ల‌న్నీ గంప గుత్త‌గా రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని కాంగ్రెస్(Congress) పార్టీ వైపు చూపించ‌డం విస్తు పోయేలా చేసింది. మొత్తంగా సీఎం కేసీఆర్ దొర పాల‌న అంతం కాబోతోంది. ప్ర‌జ‌లు గంప గుత్త‌గా ఊహించ‌ని షాక్ ఇచ్చారు గులాబీ పార్టీకి. ఎక్క‌డ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా హ‌స్తం ప‌దేళ్ల త‌ర్వాత ప‌వ‌ర్ లోకి రాబోతోంద‌ని పేర్కొన్నాయి. ప్ర‌ధానంగా రాష్ట్రంలో ప్ర‌భుత్వ వ్య‌తిరేకంగా తీర్పు ఇవ్వ‌బోతున్నార‌నేది తేలి పోయింది.

Exit Polls Comments Viral

బీఆర్ఎస్ ప్ర‌జా ప్ర‌తినిధులు గూండాలుగా వ్య‌వ‌హ‌రించార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. న‌యా నిజాం లాగా కేసీఆర్ గా మారి పోయాడ‌న్న ప్ర‌చారం పెరిగింది. అంతే కాకుండా ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌క పోవ‌డం , భూ దందాలు, అవినీతి అక్ర‌మాల‌కు కేరాఫ్ గా మారాయ‌ని జ‌నం న‌మ్మారు. నిశ్శ‌బ్ద విప్ల‌వం రాబోతోంద‌ని ముందు నుంచీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్ర‌క‌టిస్తూ వ‌చ్చారు. ప్ర‌త్యేకించి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవ‌డంలో పూర్తిగా బీఆర్ఎస్ విఫ‌ల‌మైంద‌ని మాత్రం చెప్ప‌క త‌ప్ప‌దు. నిరుద్యోగుల శాపం, బీఆర్ఎస్ దౌర్జ‌న్యాలకు తెర దించాల‌ని జ‌నం డిసైడ్ అయ్యార‌ని తేలి పోయింది ఈ ఎగ్జిట్ పోల్స్ ను చూస్తే.

ఇక స‌ర్వేల ప‌రంగా చూస్తే కాంగ్రెస్(Congress) పార్టీకి పూర్తి ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించాయి. ఇది ఒక ర‌కంగా కేసీఆర్ కు శాపంగా మార‌నుంద‌ని తేలి పోయింది. ఆరా స‌ర్వే సంస్థ కాంగ్రెస్ పార్టీకి 58 నుంచి 67 స్థానాలు వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేసింది. బీఆర్ఎస్ కు 41 నుంచి 49 స్థానాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతుంద‌ని తెలిపింది. బీజేపీ 5 నుంచి 7 సీట్లు , ఎంఐఎం 7 సీట్లు, ఇత‌రుల‌కు 2 సీట్ల‌లో గెలిచే ఛాన్స్ ఉంద‌ని పేర్కొంది. ఇక పీటీఎస్ గ్రూప్ సంస్థ ప్ర‌క‌టించిన విధంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి అత్య‌ధిక సీట్లు వ‌స్తాయ‌ని వెల్ల‌డించింది.

ఏకంగా ఆ పార్టీకి 65 నుంచి 68 సీట్లు కైవ‌సం చేసుకోబోతోంద‌ని, ఎలాంటి హంగ్ అంటూ ఉండ‌ద‌ని పేర్కొంది. ఇక బీఆర్ఎస్ 35 నుంచి 40 సీట్ల‌కు ప‌రిమితం కాబోతోంద‌ని తెలిపింది. బీజేపీ 7 నుంచి 10 సీట్లు, ఎంఐఎం 6 నుంచి 7 సీట్లు ఇత‌రులు ఒక‌టి లేదా రెండు సీట్లు వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేసింది.

ఇక చాణ‌క్య స్ట్రాట‌జీస్ సంస్థ సెన్సేష‌న్ వివ‌రాలు ప్ర‌క‌టించింది. కాంగ్రెస్ పార్టీకి 67 నుంచి 78 సీట్లు వ‌స్తాయ‌ని అంచ‌నా వేసింది. బీఆర్ఎస్ పార్టీ కేవ‌లం 22 నుంచి 31 సీట్ల‌కే ప‌రిమితం కాక త‌ప్ప‌ద‌ని పేర్కొంది. బీజేపీ(BJP) 6 నుంచి 9 సీట్లు , ఎంఐఎం 6 నుంచి 7 సీట్లు వ‌స్తాయ‌ని తెలిపింది. ఇక రిల‌య‌న్స్ కంపెనీకి చెందిన న్యూస్ 18 సంస్థ ఏకంగా హ‌స్తం పార్టీకి 56 సీట్లు ప‌క్కాగా వ‌స్తాయ‌ని పేర్కొంది. బీఆర్ఎస్ కు 48 సీట్లు, బీజేపీ 10 సీట్లు, ఎంఐఎం 5 సీట్లు, ఇత‌రులు ఒక‌రికి ఛాన్స్ ఉంద‌ని స్ప‌ష్టం చేసింది. ఇక సీ ప్యాక్ సంస్థ సైతం కాంగ్రెస్ పార్టీకి 65 సీట్లు, బీఆర్ఎస్ కు 41 సీట్లు, బీజేపీకి 4 , ఎంఐఎం 5 సీట్లు , ఇత‌రులు 4 సీట్ల‌లో వ‌స్తాయ‌ని తెలిపింది.

మ‌రో వైపు రాస్తా సంస్థ కాంగ్రెస్ పార్టీకి 51 నుంచి 61 సీట్లు కైవ‌సం చేసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. బీఆర్ఎస్ కు 40 నుంచి 50 సీట్లు, బీజేపీకి 8 నుంచి 12 సీట్లు, ఎంఐఎం 7 సీట్లు, ఇత‌రులు ఒక దానిలో గెలుస్తుంద‌ని పేర్కొంది. పీపుల్స్ ప‌ల్స్ సంస్థ కాంగ్రెస్ పార్టీకి 62 సీట్ల నుంచి 72 సీట్లు వ‌స్తాయ‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది. బీఆర్ఎస్(BRS) పార్టీకి 35 నుంచి 45 సీట్లు, బీజేపీకి 3 నుంచి 8 సీట్లు, ఇత‌రులు ఒకటి లేదా 2 సీట్లు వ‌స్తాయ‌ని పేర్కొంది. జ‌న్ కీ బాత్ సంస్థ కాంగ్రెస్ పార్టీకి 48 నుంచి 64 సీట్లు వ‌స్తాయ‌ని తెలిపింది. బీఆర్ఎస్ కు 45 నుంచి 51 సీట్లు, బీజేపీ నుంచి 7 నుంచి 13 సీట్లు, ఎంఐఎం కు 4 నుంచి 7 సీట్లు వెల్ల‌డించింది.

పొలిటిక‌ల్ ల్యాబోరేట‌రీ సంస్థ కాంగ్రెస్ పార్టీకి 58 సీట్ల నుంచి 61 సీట్లు , బీఆర్ఎస్ కు 35 నుంచి 38 సీట్లు, బీజేపీ 10 నుంచి 12 సీట్లు , ఎంఐఎం 6 నుంచి 7 సీట్లు వ‌స్తాయ‌ని పేర్కొంది. మొత్తంగా ప్ర‌జ‌లు విల‌క్ష‌ణ‌మైన‌..విష్ప‌ష్ట‌మైన తీర్పు ఇవ్వ‌డం ప్ర‌జాస్వామ్యాన్ని ర‌క్షించ‌డ‌మే. మొత్తంగా అహంకారం ఓడి పోయింది. ఆత్మ గౌర‌వం గెలిచి నిలిచింది.

Also Read : Polling Day Comment : ఓటు ఆయుధం ప్ర‌జాస్వామానికి మూలం

Leave A Reply

Your Email Id will not be published!