CM KCR Resign : ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాజీనామా

స్వంత వాహ‌నంలో ఫామ్ హౌస్ కు

CM KCR Resign : హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్(CM KCR) రాజీనామా చేశారు. సీఎం స్వ‌యంగా వ‌చ్చి గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ వ‌ద్ద‌కు వ‌స్తార‌ని అనుకున్నారు అంతా. కానీ ఊహించ‌ని రీతిలో కేసీఆర్ తాను రాజీనామా చేసిన లేఖ‌ను ఓఎస్డీ ద్వారా గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు పంపించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి నేరుగా త‌న స్వంత ఫామ్ హౌస్ కు వెళ్లి పోయారు. ఇది విస్తు పోయేలా చేసింది. ఎలాంటి కాన్వాయ్ లేకుండానే కేసీఆర్ వెళ్లి పోయిన‌ట్లు స‌మాచారం.

CM KCR Resign His Post

ముచ్చ‌ట‌గా మూడోసారి సీఎం కావాల‌ని అనుకున్నారు. ఆయ‌న అంచ‌నాలు తారు మార‌య్యాయి. విచిత్రం ఏమిటంటే పోలింగ్ ముగిసిన వెంట‌నే బీఆర్ఎస్ పార్టీ చీఫ్ గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. డిసెంబ‌ర్ 4న రాష్ట్ర స‌చివాల‌యంలో కీల‌క కేబినెట్ భేటీ ఉంటుంద‌ని పేర్కొన్నారు.

అంచ‌నాలు తారు మారు చేస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సార‌థ్యంలో భారీ మెజారిటీని సాధించింది. ఏకంగా 60 సీట్ల‌కు గాను 64 సీట్ల‌కు పైగా కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు గెలుపొందారు. మంత్రులు కేటీఆర్ , హ‌రీశ్ రావు త‌మ ఓట‌మిని అంగీక‌రించారు. ఈ సంద‌ర్బంగా గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసిన కాంగ్రెస్ పార్టీని అభినందించారు. మొత్తంగా ఎలాంటి కాన్వాయ్ లేకుండానే వెళ్లి పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Also Read : Revanth Reddy : అమ‌ర వీరుల‌కు ఈ విజ‌యం అంకితం

Leave A Reply

Your Email Id will not be published!