Revanth Reddy CM : ప్రమాణ స్వీకారం రేవంత్ సీఎం..?
సోమవారం ముహూర్తం ఫిక్స్
Revanth Reddy : హైదరాబాద్ – ఎట్టకేలకు తెలంగాణ ఫలితాలు వెల్లడయ్యాయి. స్పష్టమైన మెజారిటీని సాధించింది టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సారథ్యంలో. 119 సీట్లకు గాను 65 సీట్లు సాధించింది హస్తం. దీంతో ఎవరు సీఎంగా కొలువు తీరుతారనే దానిపై ఉత్కంఠకు తెర దించింది ఏఐసీసీ హై కమాండ్. ఈ మేరకు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన అభ్యర్థులు జంప్ కాకుండా ఉండేదుకు కట్టుదిట్టం చేసింది. ఇందులో భాగంగా ఈనెల 9న ప్రమాణ స్వీకారం కాకుండా సోమవారం కేబినెట్ ను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.
Revanth Reddy CM..?
పార్టీకి అన్నీ తానై వ్యవహరిస్తూ వస్తున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే గెలుపొందిన వారంతా హుటా హుటిన హైదరాబాద్ కు రావాలని ఆదేశించింది పార్టీ. దీంతో తాజ్ కృష్ణా హోటల్ లో ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షం అధినేతగా గెలిచిన వారు అనుముల రేవంత్ రెడ్డిని(Revanth Reddy) ఎన్నుకోనున్నట్లు సమాచారం.
పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావడంలో, అన్నీ తానే ముందుండి నడిపించడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈ మేరకు సీఎల్పీ నేతగా ఎన్నుకోనున్నారు. ఆయనకు తోడుగా ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్కను నియమించినట్లు సమాచారం. రేపటితో ప్రమాణ స్వీకారం చేయించి, మిగతా కేబినెట్ లో ఈనెల 9న లాల్ బహదూర్ వేదికగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు టాక్.
Also Read : Congress Win Comment : గులాబీకి పాతర జనం జాతర