Gareth Wynn Owen : రేవంత్ కు హై క‌మిష‌న‌ర్ కంగ్రాట్స్

పార్టీ విజ‌యంపై అభినంద‌న‌లు

Gareth Wynn Owen : హైద‌రాబాద్ – రాష్ట్రంలో ప్ర‌భుత్వం మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. దీంతో వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు పార్టీని ప‌వ‌ర్ లోకి తీసుకు రావ‌డంలో కీల‌క పాత్ర పోషించిన ఆ పార్టీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డికి క్యూ క‌ట్టారు. మొత్తం 119 సీట్ల‌కు గాను కాంగ్రెస్ 64 సీట్ల‌ను కైవ‌సం చేసుకుంది.

Gareth Wynn Owen Wishes to

తాజాగా తెలంగాణ‌, ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రాల‌లో బ్రిటీష్ డిప్యూటీ హై క‌మిష‌న‌ర్ గా ప‌ని చేస్తున్న గారెత్ విన్ ఓవెన్(Gareth Wynn Owen) రేవంత్ రెడ్డిని క‌లుసుకున్నారు . ఆయ‌న నివాసంలో రెడ్డిని ప్ర‌త్యేకంగా అభినందించారు. నూత‌న స‌ర్కార్ ను ఏర్పాటు చేయ‌బోతున్నందుకు కంగ్రాట్స్ తెలిపారు ఓవెన్.

బ్రిటీష్ , తెలంగాణ రాష్ట్రం మ‌ధ్య సంబంధాల‌ను మ‌రింత బలోపేతం చేసేందుకు మీతో, మీ బృందంతో క‌లిసి ప‌ని చేసందుకు ఎదురు చూస్తున్న‌ట్లు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డితో క‌లిసిన ఫోటోల‌ను ఈ సంద‌ర్బంగా సోమ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియా వేదిగా హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

ఇదిలా ఉండ‌గా త‌న‌ను క‌లిసిన బ్రిటీష్ డిప్యూటీ హై క‌మిష‌న‌ర్ ను ప్ర‌త్యేకంగా అభినందించారు. మీరు కోరుకున్న‌ట్లుగా తాము స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

Also Read : Andhra Voters : బీఆర్ఎస్ కు జై కొట్టిన షెటిల‌ర్స్

Leave A Reply

Your Email Id will not be published!