Eatala Rajender : ప్రజా తీర్పును స్వాగతిస్తున్నా
ఈటల రాజేందర్ కామెంట్స్
Eatala Rajender : హైదరాబాద్ – బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను ఓటమి చెందడంపై కామెంట్ చేయడం కలకలం రేపుతోంది. ఈసారి ఎన్నికల్లో రెండు నియోజకవర్గాలలో బరిలో నిలిచారు.
Eatala Rajender Said
గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఈటెలకు(Eatala Rajender) షాక్ ఇచ్చారు. విచిత్రంగా మూడో స్థానానికి చేరుకోవడం ఆసక్తిని రేపింది.
ఎన్నికల ఫలితాలు తనకు ప్రతికూలంగా రావడంపై స్పందించిన ఈటల ప్రజా తీర్పును స్వాగతిస్తున్నట్లు స్పష్టం చేశారు. తనను ప్రేమించి దీవించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఇన్నేళ్లుగా సేవ చేసే భాగ్యాన్ని కలిగించారని, వారి రుణం తీర్చుకోలేనిదని అన్నారు. ఫలితాన్ని జీర్ణించుకోలేక పోతున్న కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరికీ నా వినమ్ర విజ్ఞప్తి ని అర్థం చేసుకోవాలన్నారు. ఎవరూ ఆవేదన చెందవద్దని, ప్రజల తీర్పును గౌరవించాలని కోరారు ఈటల రాజేందర్. గజ్వేల్ లో తక్కువ కాలమే అయినా ఆదరించినందుకు ఆనందంగా ఉందన్నారు.
Also Read : Bandi Sanjay : ఓ వర్గం ఒక్కటైంది ఓడించింది