T Prabhakar Rao : ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు రిజైన్
కొనసాగుతున్న రాజీనామాల పర్వం
T Prabhakar Rao : హైదరాబాద్ – రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో గతంలో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ వచ్చిన ఉన్నతాధికారులు స్వచ్చంధంగా తప్పుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా తన అరెస్ట్ లో కీలక పాత్ర వహించిన ఎస్ఐబీ చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు పై సంచలన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి.
T Prabhakar Rao Resign Viral
తాము అధికారంలోకి రావడం ఖాయమని, తప్పకుండా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఒకవేళ తాను చంద్ర మండలంలోకి వెళ్లినా వదిలి పెట్టనంటూ పేర్కొన్నారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు ప్రభాకర్ రావు.
ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరడంతో మరో ఉన్నతాధికారి రాధా కిషన్ రావుతో పాటు తాజాగా టి. ప్రభాకర్ రావు తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు యాంటీ నక్సల్ ఇంటెలిజెన్స్ వింగ్ తో పాటు ఎస్ఐబీ ఓఎస్డీగా ఉన్నారు ప్రభాకర్ రావు. మరో వైపు విద్యుత్ సంస్థ సీఎండీ ప్రభాకర్ రావు కూడా గుడ్ బై చెప్పారు.
మరో వైపు పలు కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్లు, డైరెక్టర్లు స్వచ్చంధంగా తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు.
Also Read : Radha Kishan Rao : రాధా కిషన్ రావు రాజీనామా