Vikas Raj : హైదరాబాద్ – రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజ్ సోమవారం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ను కలుసుకున్నారు. రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించారు. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా చేపట్టారు. పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. పెద్ద ఎత్తున డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. అధికార పార్టీకి వంత పాడిన పలువురి అధికారులపై వేటు వేశారు.
Vikas Raj Meet Governer
ఈ సందర్బంగా గెలుపొందిన అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను సీఈవో(CEO) వికాస్ రాజ్ గవర్నర్ కు సమర్పించారు. ఏయే పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో, పోలింగ్ శాతం ఎంత మేరకు వచ్చిందనే దానిపై తమిళి సైకి వివరించారు సిఈవో.
ఇదిలా ఉండగా ఎన్నికల ఫలితాల పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు రాగా, బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు, బీజేపీకి 8 సీట్లు, ఎంఐఎంకు 7 సీట్లు, సీపీఐకి 1 సీటు వచ్చింది. మొత్తంగా అసెంబ్లీని రద్దు చేశారు గవర్నర్. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Also Read : MP Arvind : రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్