Congress CM Comment : సీఎం ఎంపిక‌పై బిగ్ ట్విస్ట్

కొన‌సాగుతున్న స‌స్పెన్స్

Congress CM : తెలంగాణ ఎన్నిక‌ల్లో పూర్తి మెజారిటీ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ త‌న తీరు మార్చు కోవ‌డం లేదు. ఎవ‌రిని సీఎం చేయాల‌నే దానిపై ఇంకా కొలిక్కి రాలేదు. ఎప్ప‌టి లాగే ఇవాళ సీఎల్పీ స‌మావేశం ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. ఆ మేర‌కు తీర్మానం కూడా చేశారు. కానీ అంతిమ నిర్ణ‌యం మాత్రం పార్టీ హైక‌మాండ్ కు వ‌దిలి వేశారు. ఎన్నో ఒడిదుడుకుల‌ను ఎదుర్కొంటూ క‌న్న‌డ నాట కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త కేపీసీసీ చీఫ్‌, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు. మొత్తం 64 మంది కాంగ్రెస్(Congress) ఎమ్మెల్యేల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నారు.

అనంత‌రం డీకే కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎల్పీ నేత ఎంపిక వ్య‌వ‌హాహారం పార్టీ హైక‌మాండ్ చూసుకుంటుంద‌ని చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీకి గిఫ్ట్ గా పార్టీకి అత్య‌ధిక సీట్లు క‌ట్ట‌బెట్టారు ప్ర‌జ‌లు. వారి న‌మ్మ‌కాన్ని, విశ్వాసాన్ని నేత‌లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేక పోవ‌డం ఒకింత బాధ క‌లిగిస్తోంది.

Congress CM Comment Viral

ఎన్నిక‌ల్లో అంద‌రూ స‌మ‌న్వ‌యంతో ప‌ని చేసినా చివ‌రగా సీఎం ప‌ద‌వి విష‌యానికి వ‌చ్చే స‌రిక‌ల్లా ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకునేంత దాకా వెళ్లిన‌ట్లు స‌మాచారం. ఏది ఏమైనా రాష్ట్రంలో గ‌త 10 ఏళ్లుగా అంప‌శ‌య్య‌పై ఉన్న హ‌స్తం పార్టీకి పున‌ర్ వైభ‌వాన్ని తీసుకు రావ‌డంలో ఎన‌లేని రీతిలో కృషి చేశాడు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఆయ‌న అన్నీ తానై వ్య‌వ‌హ‌రించాడు. ఈసారి గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని, ఉద్య‌మ నాయ‌కుడైన సీఎం కేసీఆర్ ను ఢీకొన‌డంలో త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. 119 సీట్ల‌లో 64 సీట్లు సాధించ‌డంలో పార్టీకి చెందిన సీనియ‌ర్లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు రేవంత్ రెడ్డి పాత్ర విస్మ‌రించ లేనిది. ఇదే సీన్ ఇటీవ‌ల క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత చోటు చేసుకుంది. సీఎం ప‌ద‌వి కోసం సిద్ద‌రామ‌య్య‌తో పాటు డీకే శివ‌కుమార్ పోటీ ప‌డ్డారు. అధిష్టానం చివ‌ర‌కు సిద్ద‌రామ‌య్య‌పై మొగ్గు చూపింది. క్లీన్ ఇమేజ్ ఉన్న ఆయ‌న‌కే అప్ప‌గించింది.

ఇదే స‌మ‌యంలో సీఎల్పీ స‌మావేశంలో వాడి వేడిగా చ‌ర్చ‌లు , వాగ్వావాదాలు చోటు చేసుకున్న‌ట్లు స‌మాచారం. రేవంత్ రెడ్డిని సీఎంగా చేస్తే తాము ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేదంటూ సీనియ‌ర్ నాయ‌కులు డీకే శివ‌కుమార్ కు స్ప‌ష్టం చేసిన‌ట్లు బ‌య‌ట ప్ర‌చారం జ‌రుగుతోంది. స్పీక‌ర్ ప‌ద‌వి ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేస్తే శ్రీ‌ధ‌ర్ బాబు ఖాళీగా ఉంటాను కానీ ఆ ప‌ద‌వి వ‌ద్ద‌ని చెప్పార‌ని, డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇస్తే త‌న‌కు ఒక్క‌రికే ఇవ్వాల‌ని వేరే వాళ్ల‌కు ఇస్తే ఊరుకోనంటూ భ‌ట్టి ఫైర్ అయిన‌ట్లు తెలిసింది.

ఇదే స‌మ‌యంలో సీత‌క్క‌కు ఛాన్స్ ఇవ్వాల‌ని రేవంత్ కోరార‌ని, దానిపై మిగ‌తా నేత‌లు అభ్యంత‌రం చెప్పారంటూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఇక పార్టీ ప‌రంగా చూస్తే సీఎం రేసులో రేవంత్ రెడ్డి, కోమ‌టి రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క , దామోద‌ర రాజ న‌ర‌సింహ ఉన్నారు. ఇక రాజ్ భ‌వ‌న్ లో ప్ర‌మాణ స్వీకారం ఉంటుంద‌ని ఏర్పాట్లు చేశారు. తీరా సీఎం ఎంపిక విష‌యంలో కొలిక్కి రాక పోవ‌డంతో దానిని మార్చేశారు. మొత్తం మీద సీఎం పంచాయ‌తీ ఇప్పుడు హ‌స్తిన‌కు చేరుకోవ‌డం ఒకింత ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఇక‌నైనా కాంగ్రెస్ పార్టీ మారితే బెట‌ర్.

Also Read : Congress Win Comment : గులాబీకి పాత‌ర జ‌నం జాత‌ర

Leave A Reply

Your Email Id will not be published!