CM KCR : హైదరాబాద్ – బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(CM KCR) గజ్వేల్ లోని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో పార్టీ ఎందుకు ఓటమి పాలైంది, దానికి గల కారణాలు ఏమిటి అనే దానిపై పోస్టు మార్టం చేపట్టారు.
CM KCR Meet
అంతకు ముందు ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు కేసీఆర్ ఆశీర్వాదం పొందారు. మాజీ మంత్రులు , ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో 119 శాసన సభ నియోజకవర్గాలకు గాను 64 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. భారత రాష్ట్ర సమితి పార్టీ కేవలం 39 సీట్లకు మాత్రమే పరిమితమైంది.
ఇక ఊహించని రీతిలో ఈసారి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 8 సీట్లను పొందింది. గతంలో కంటే ఓట్ల శాతం పెరగడం ఆ పార్టీకి బలంగా మారనుంది. మరో వైపు బీఆర్ఎస్ కు గంప గుత్తగా మద్దతు పలికిన ఎంఐఎం పార్టీ చివరి దాకా పోరాడింది. తిరిగి తన 7 సీట్లను తిరిగి గెలుపొందింది.
కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా ఉన్న సీపీఐ పార్టీ పోటీ చేసిన నియోజకవర్గంలో గెలుపొందింది. ఆ పార్టీ అభ్యర్థిగా కూనంనేని సాంబశివ రావు విజయం సాధించారు. ఈ సందర్భంగా కేసీఆర్ తో పాటు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సమీక్షించారు. అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ కూడా పార్టీ ఓటమిపై రివ్యూ చేశారు.
Also Read : Vikas Raj : గవర్నర్ ను కలిసిన సీఈవో