CM Revanth Reddy : ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత
లైన్ క్లియర్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో , బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ సాగించిన 10 ఏళ్ల దమనకాండలో ఉద్యమకారులపై నమోదు చేసిన కేసుల విషయంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోబోతోన్నారా. అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
CM Revanth Reddy Shocking Decision
నియంతకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు, ఆందోళనలు, ఉద్యమాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, నిరసనలు వ్యక్తం చేశారు తెలంగాణ ఉద్యమకారులు. ఇదిలా ఉండగా పెద్ద ఎత్తున కక్ష సాధింపు ధోరణితో కేసులు నమోదు చేశారు. దీంతో తాజాగా జరిగిన ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
ఉద్యమకారులపై నమోదు చేసిన కేసులను ఎత్తి వేస్తామని స్పష్టం చేశారు. ఈమేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉద్యమకారులపై నమోదు చేసిన, ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్క కేసును ఎత్తి వేయాలని ఆదేశించినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వారికి తన ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). అమర వీరులకు, ఉద్యమకారులకు తీపి కబురు చెప్పారు. ధర్నా చౌక్ ను తెరుస్తున్నట్టు తెలిపారు. ఇవాళ ప్రజా దర్బార్ ను నిర్వహించారు.
Also Read : Bhanu Prakash Reddy : టీటీడీ నిధులు దారి మళ్లింపు