Revanth Reddy Comment : గులాబీ దండులో గుబులు

దూకుడు పంచిన రేవంత్ రెడ్డి

Revanth Reddy : నిన్న‌టి దాకా ప‌రిస్థితి వేరు. ఇప్పుడు తెలంగాణ‌లో ప‌రిస్థితి చ‌కా చ‌కా మారి పోయింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని గులాబీ దండు అంతులేని రీతిలో అరాచకాలు, అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డింది. కోట్లాది రూపాయ‌ల ప్ర‌జా ధ‌నాన్ని దుర్వినియోగం చేశారు. కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తారు. ఒక్కో ఎమ్మెల్యే ఆనాటి నిజాం ప్ర‌భువును మించి పోయారు. ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను కాల‌రాశారు. చివ‌ర‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్ ను ఎవ‌రికీ కాకుండా చేశారు. ఇదంతా ఒక ఎత్తైతే రిటైర్డ్ అధికారులు ఒక ముఠాగా ఏర్ప‌డి సాగించిన వేధింపులు అంతా ఇంతా కాదు. మొత్తంగా ఈ ప‌దేళ్ల కాలంలో తెలంగాణ పేరుతో కొలువు తీరిన దొర కేసీఆర్ సాగించిన అప‌స‌వ్య పాల‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఉద్య‌మ‌కారుల‌పై వేధింపులే కాదు త‌మ గురించి ప్ర‌శ్నించిన వాళ్ల‌ను వెంట ప‌డి వేధించారు. ఆపై మ‌ట్టు బెట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఇదే స‌మ‌యంలో కీల‌క శాఖ‌ల‌లో త‌మ ప‌రివారాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన దోపిడీ గురించి చెప్పాలంటే క‌నీసం ఐదేళ్ల స‌మ‌యం కూడా స‌రి పోదు.

Revanth Reddy Comment Viral

ముచ్చ‌ట‌గా మూడోసారి తెలంగాణ‌లో కొలువు తీరాల‌ని క‌ల‌లు క‌న్న కేసీఆర్ ఆశ‌ల‌కు నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జానీకం నీళ్లు చ‌ల్లింది. కాంగ్రెస్ పార్టీకి 64 సీట్ల‌ను క‌ట్ట‌బెట్టింది. ఈ మేర‌కు ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆరు గ్యారెంటీల‌ను ఇచ్చింది. ప్ర‌భుత్వం వ‌చ్చిన వెంట‌నే కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఆయ‌న ప్ర‌జా ద‌ర్బార్ ను నిర్వ‌హించారు. ప్ర‌జ‌ల విన‌తులు స్వీక‌రించారు. స‌ర్కార్ ఏర్ప‌డుతుంద‌ని తెలియ‌గానే ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు, ఉన్న‌తాధికారులు, రిటైర్డు ఆఫీస‌ర్లు ఇంటి బాట ప‌ట్టారు. కేసీఆర్ ను, అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన అక్ర‌మాల చిట్ట పెరిగి పోయింది. అది అన‌కొండ‌ను మించి పోయింది. ఇదే స‌మ‌యంలో విద్యుత్ సంస్థ‌కు సంబంధించి రూ. 85,000 కోట్ల అప్పులు ఎలా ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి(Revanth Reddy) నిల‌దీసిన ప్ర‌శ్న ఇప్పుడు గులాబీ బాస్ కేసీఆర్ వెన్నులో వ‌ణుకు పుట్టించేలా చేసింది.

ప్ర‌స్తుతం కేసీఆర్ బాత్రూంలో జారి ప‌డి య‌శోద‌లో చికిత్స పొందుతున్నారు. కానీ అక్ర‌మాల‌కు పాల్ప‌డిన ఎవ‌రైనా, ఎంతటి వారైనా, ఏ స్థాయిలో ఉన్నా వారిని వ‌దిలి పెట్టే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు. ఆ మేర‌కు పాల‌న లో దూకుడు పెంచారు. ఇప్ప‌టికే త‌న స‌మీక్ష‌కు రాకుండా డుమ్మా కొట్టిన సీఎండీ దేవుల‌ప‌ల్లి ప్ర‌భాక‌ర్ రావు రావాల్సిందిగా ఆదేశించారు.

ఒక‌వేళ రాక పోతే నోటీసులు ఇచ్చి తీసుకు రావాల‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో ఆయా ప్రాజెక్టుల‌లో అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వారి గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి. ఇదే స‌మ‌యంలో గులాబీ దండులో ప్ర‌స్తుతం ఉన్న ఎమ్మెల్యేల‌తో పాటు ఓడి పోయిన వారిలో భ‌యం మొద‌లైంది. మ‌రో వైపు ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. నిన్న‌టి దాకా ప్ర‌జ‌ల మీద దాడుల‌కు పాల్ప‌డుతూ, వారిని చుల‌క‌న‌గా చేస్తూ వ‌చ్చిన వారికి ఇప్ప‌టికే చేదు అనుభ‌వం ఎదురైంది. చంద్ర మండ‌లంకు వెళ్లినా తాను వ‌దిలి వేసే ప్ర‌స‌క్తి లేద‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. మొత్తంగా రేవంత్ రెడ్డి దూకుడుకు పారి పోతారా లేకు జైలుకు వెళ‌తారా అన్న‌ది వేచి చూడాలి.

Also Read : CM Revanth Reddy : సీఎంగా కొలువు తీరిన రేవంత్ రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!