Chandra Babu Case : బాబుకు ఊరట విచారణ వాయిదా
జనవరి 17కు మార్చిన హైకోర్టు
Chandra Babu : న్యూఢిల్లీ – తెలుగుదేశం పార్టీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. ఏపీ స్కిల్ స్కాం కేసులో ఆయన 53 రోజుల పాటు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవలే పర్మినెంట్ బెయిల్ పై విడుదలయ్యారు. అనంతరం ఆంధప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న తుపాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. బాధిత రైతులను పరామర్శించారు.
Chandra Babu Fiber net case
ఇదే సమయంలో చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ ఏకంగా 8 కేసులు నమోదు చేసింది. తాజాగా ఫైబర్ నెట్ కింద నమోదైన కేసుకు సంబంధించి విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ఈ మేరకు పూర్తిగా వాదోప వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి కీలక ప్రకటన చేశారు.
బెయిల్ పిటిషన్ పై విచారణను వచ్చే నెలకు వాయిదా వేయడంతో నారా చంద్రబాబు నాయుడుకు(Chandra Babu) ఊరట లభించింది. ఇదే సమయంలో జడ్జి సూచనలు చేయడం విశేషం. కేసుకు సంబంధించిన విషయాలపై ఎలాంటి కామెంట్స్ చేయొద్దంటూ ఏపీ సర్కార్ కు సూచన చేశారు.
ఇదే సమయంలో ఇరు పక్షాలు సంయమనం పాటించాలని స్పష్టం చేసింది కోర్టు. ఇదిలా ఉండగా ఏపీలో విస్తృతంగా పర్యటిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు, తనయుడు నారా లోకేష్ బాబు.
Also Read : Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.15 కోట్లు