Sudheer Reddy : బీఆర్ఎస్ లో కామెంట్స్ కలకలం
సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు హల్ చల్
Sudheer Reddy : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో కొత్త సర్కార్ ఏర్పడినా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చేస్తున్న కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో కొనుగోలు చేయడం లేదా ఉన్న సర్కార్ కూలి పోతందంటూ వ్యాఖ్యలు చేయడంపై ఆ పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.
Sudheer Reddy Shocking Comments
ఓ వైపు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోని బాత్రూంలో జారి పడ్డారు కేసీఆర్. ఆయన ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పడి వారం రోజులు కాక ముందే కూలి పోతుందని సీనియర్ నేతలు కామెంట్స్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు జనం. పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఎందుకు కంట్రోల్ చేయలేక పోతున్నారంటూ మండి పడుతున్నారు.
ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కానీ లేదా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నం చేస్తే జనం రాళ్లతో కొట్టడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఆరు నెలలు మాత్రమే ఉంటుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. వీరి కామెంట్స్ ను తీవ్రంగా తప్పు పట్టారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి(Sudheer Reddy). కనీసం ఆరు నెలల సమయం ఇవ్వక పోతే ఎలా అని ప్రశ్నించారు.
Also Read : YS Sharmila : ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల..?