Telangana Speaker : స్పీకర్ గా గడ్డం ప్రసాద్ నామినేషన్
మద్దతు తెలిపిన బీఆర్ఎస్
Telangana Speaker : హైదరాబాద్ – తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా వికారాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన గతంలో మంత్రిగా కూడా పని చేశారు. ఈ సందర్భంగా ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్.
Telangana Speaker – Gaddam Prasad
ఇదిలా ఉండగా స్పీకర్ నామినేషన్ పత్రంపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజ నరసింహ, సీతక్క సంతకాలు చేశారు. అయితే బీఆర్ఎస్ తరపున సపోర్ట్ చేయడం విశేషం.
కాగా ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూర్తి సమ్మతి తెలిపారు. గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) నామినేషన్ కు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.
మరో వైపు ప్రొటెం స్పీకర్ గా కాంగ్రెస్ సర్కార్ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని నియమించింది. ఆయన డిసెంబర్ 14న జరిగే స్పీకర్ ఎన్నికను పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే కొత్తగా ఎన్నికైన అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
Also Read : Vijay Sai Reddy : ఉపాధి హామీ బకాయిలు చెల్లించండి