Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తే ఊరుకోం
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు
Harish Rao : సంగారెడ్డి – మాజీ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన కామెంట్స్ చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. తనకు భారీ ఆధిక్యాన్ని కట్టబెట్టిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని అన్నారు హరీశ్ రావు.
Harish Rao Comment
ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు. పార్టీ నాయకత్వం వారికి సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. అధికారం పోయిందని ఎవరూ బాధ పడాల్సిన అవసరం లేదన్నారు హరీశ్ రావు(Harish Rao). సంగారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సభను నిర్వహించారు.
ఇక్కడి కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. బరి గీసి చింతా ప్రభాకర్ ను గెలిపించు కోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు హరీశ్ రావు. ప్రతీ కార్యకర్త, నాయకుడు తానే అభ్యర్థి అనుకుని పని చేశారని, అందుకే ఇక్కడ గ్రాండ్ విక్టరీ నమోదు చేయడం జరిగిందన్నారు.
ప్రస్తుతం స్థానిక, లోక్ సభ ఎన్నికలు రాబోతున్నాయని గులాబీ జెండా అన్ని చోట్ల రెప రెప లాడేలా కృషి చేయాలని మాజీ మంత్రి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరినీ పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానని స్పష్టం చేశారు తన్నీరు హరీశ్ రావు.
Also Read : Hyderabad Best : భాగ్యనగరం అత్యుత్తమం