Assembly Security : తెలంగాణ అసెంబ్లీ వద్ద భారీ భద్రత
ఆదేశించిన కాంగ్రెస్ ప్రభుత్వం
Assembly Security : హైదరాబాద్ – పార్లమెంట్ లో తాజాగా చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాల్టి నుంచి శాసన సభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఎమ్మెల్యేలుగా కొందరు ప్రమాణ స్వీకారం చేశారు.
Assembly Security Improved in Telangana
ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ నూతన స్పీకర్ గా వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమారతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసలతో ముంచెత్తారు.
శాసన సభ సమావేశాలను పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ రివ్యూ చేశారు. ఈ మేరకు అసెంబ్లీ వద్ద భారీ భద్రతను పెంచాలని ఆదేశించారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. లోక్ సభలో స్మోక్ బాంబు దాడి జరిగింది. వారిని పట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా అసెంబ్లీలోకి భద్రతా పరంగా ప్రతి ఒక్కరినీ తనిఖీ చేస్తారు. ఎమ్మెల్యేలతో కేవలం ఒకే ఒక్క వ్యక్తిని మాత్రమే అనుమతి ఇస్తారు. అసెంబ్లీ పాసులు ఉన్న వారిని కూడా తనిఖీ చేయకుండా వెళ్లనీయరు. ఇది మీడియాకు కూడా వర్తిస్తుందని పోలీసులు స్పష్టం చేశారు. తమతో సహకరించాలని సూచించారు.
Also Read : MLC Jeevan Reddy : కేటీఆర్ పై జీవన్ రెడ్డి కన్నెర్ర