MLC Jeevan Reddy : కేటీఆర్ పై జీవ‌న్ రెడ్డి క‌న్నెర్ర‌

మాకు స‌ర్కార్ న‌డ‌ప‌డం తెలుసు

MLC Jeevan Reddy : హైద‌రాబాద్ – మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ స‌ర్కార్ ఎలా న‌డుపుతుందో చూస్తానంటూ కామెంట్స్ చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఓ వైపు బీఆర్ఎస్ మ‌రో వైపు బీజేపీ నాయ‌కులు ప‌దే ప‌దే ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొడ‌తామంటూ ప్ర‌క‌టించడాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

MLC Jeevan Reddy Comments on KCR

మీరేమీ ఆందోళ‌న చెందాల్స‌ని ప‌ని లేద‌న్నారు. గ‌తంలో ఎన్నో ప్ర‌భుత్వాల‌ను న‌డిపిన చ‌రిత్ర త‌మ పార్టీకి ఉంద‌న్నారు. ఈ విష‌యాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు జీవ‌న్ రెడ్డి(Jeevan Reddy). మీరు భ‌య‌ప‌డిన‌ట్లుగా ఏమీ జ‌ర‌గ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వం ఎలా న‌డ‌పాలో , ఎలా ఉండ కూడ‌దో త‌మ‌కు బాగా తెలుస‌ని పేర్కొన్నారు ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి.

ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా కొత్త‌గా ఎన్నికైన ప్ర‌భుత్వానికి స‌హ‌కరించాల్సింది పోయి ఉన్న‌ట్టుండి విమ‌ర్శ‌లు చేయ‌డం దారుణ‌మ‌న్నారు . ఎన్నిక‌ల్లో లెక్క‌లేన‌న్ని హామీలు ఇచ్చింది మీరు కాదా అని ప్ర‌శ్నించారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసింది మీరు అన్నది మ‌రిచి పోయారా అని నిల‌దీశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చి ఇప్పుడు త‌మ‌పై నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు జీవ‌న్ రెడ్డి.

Also Read : CM Revanth Reddy : ఉచిత బ‌స్సు స‌బ్సిడీకి రూ. 374 కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!