KCR Discharge : మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్
ఫామ్ హౌస్ కు తరలింపు
KCR : హైదరాబాద్ – మాజీ సీఎం కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోని బాత్రూంలో జారి పడ్డాడు. ఈ సందర్బంగా ఎడమ కాలి తుంటి ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో హుటా హుటిన కేసీఆర్ ను హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు.
KCR Discharged
వెంటనే పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు కేసీఆర్ కు శస్త్ర చికిత్స చేపట్టారు. వారం రోజుల పాటు కేసీఆర్ యశోదలో చికిత్స పొందారు. ఆయనను వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు.
ఆస్పత్రి యాజమాన్యం కేసీఆర్(KCR) కు ఢోకా లేదని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని ఈ మేరకు డిశ్చార్జ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా తనకు చికిత్స అందించిన డాక్టర్లు, సేవలు చేసిన నర్సులు, యశోద సిబ్బందికి, సహకరించిన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అంతే కాకుండా తన కోసం , తనను చూసేందుకు వచ్చిన అభిమానులు, నేతలు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు వెల్లడించారు కేసీఆర్.
అంతకు ముందు మాజీ సీఎం భావోద్వేగానికి లోనయ్యారు. తన కోసం ఎంతో దూరం నుంచి వస్తున్నారని, ఇక నుంచి రావద్దని కోరారు.
Also Read : Kothakota Srinivas Reddy : ధర్నా చౌక్ కు గ్రీన్ సిగ్నల్