KTR Slams : హామీల ఊసేది డీఎస్సీకి దిక్కేది
నిప్పులు చెరిగిన కేటీఆర్
KTR Slams : హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి కేటీఆర్. శాసన సభలో ఆయన సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. కేవలం మాయ మాటలతో అధికారంలోకి వచ్చారని దీనిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
KTR Slams CM Revanth Reddy
తొలి కేబినెట్ సమావేశంలోనే డీఎస్సీని ప్రకటిస్తామని అన్నారని కానీ ఇప్పటి వరకు దాని ఊసే లేదని ఎద్దేవా చేశారు. అమలుకు నోచుకోని హామీలను ప్రకటించడం దారుణమన్నారు కేటీఆర్(KTR). లక్షలాది మంది నిరుద్యోగులు ఎంతో ఆతృతతో డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారని మరి ఇచ్చిన మాటను ఎందుకు మరిచి పోయారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.
అంతే కాదు ప్రభుత్వం ఏర్పడిన 24 గంటల్లోనే రుణాలు మాఫీ చేస్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించారని, ఇప్పుడు దాని ఊసెత్తడం లేదంటూ వాపోయారు కేటీఆర్. డిసెంబర్ 9ననే ఇస్తామన్న రూ. 15,000 ల రైతు భరోసా ఏమైందని నిలదీశారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను , గ్యారెంటీలను నిలబెట్టు కోవాలని డిమాండ్ చేశారు.
Also Read : Bandi Sanjay : గులాబీ దొంగలపై కన్నేసి ఉంచండి