Amaravathi JAC : అమరావ‌తి పోరాటానికి నాలుగేళ్లు

క‌దం తొక్కిన రైతులు..జేఏసీ

Amaravathi JAC : అమ‌రావ‌తి – జేఏసీ ఆధ్వ‌ర్యంలో అమ‌రావ‌తి మాత్ర‌మే ఏపీకి సిస‌లైన రాజ‌ధానిగా ఉండాల‌ని కోరుతూ రైతులు చేప‌ట్టిన ఆందోళ‌న డిసెంబ‌ర్ 17 నాటితో నాలుగు సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయి. గ‌త కొన్నేళ్లుగా రాష్ట్ర స‌ర్కార్ కు, ఏపీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి వ్య‌తిరేకంగా పోరాడుతూ వ‌స్తున్నారు. అన్ని పార్టీలు వీరికి మ‌ద్ద‌తు తెలిపాయి.

Amaravathi JAC Protest

మూడు రాజ‌ధానుల వ‌ల్ల ఏపీకి భారం త‌ప్ప ఒరిగింది ఏమీ లేద‌న్నారు. ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీల‌తో ప్ర‌జ‌ల‌ను బురిడీ కొట్టించిన ఘ‌న‌త జ‌గ‌న్ రెడ్డికే ద‌క్కుతుంద‌న్నారు జేఏసీ నేత‌లు. అమ‌రావ‌తిని(Amaravathi) రాజ‌ధానిగా ప్ర‌క‌టించింది, అభివృద్ది చేసేందుకు ప్ర‌య‌త్నం చేసింది ఆనాటి టీడీపీ ప్ర‌భుత్వం.

చూస్తూ ఉండ‌గానే తాము అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండాల‌ని కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు, రాస్తారోకోలు, పోరాటాలు, ర్యాలీలు చేస్తూ వ‌చ్చింది. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు అమ‌రావ‌తి జేఏసీ ఆధ్వ‌ర్యంలో పాల్గొన్నారు.

ఏదో ఒక రోజు అమ‌రావ‌తి రైతులు విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని పేర్కొన్నారు టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు. మొత్తంగా అమ‌రావ‌తిని లేకుండా ఏపీని ఊహించు కోలేమ‌న్నారు. మూడు రాజ‌ధానుల ప్ర‌యోగం పూర్తిగా విఫ‌లం కాక త‌ప్ప‌ద‌న్నారు.

Also Read : Akunuri Murali : అక్ర‌మాల‌పై విచార‌ణ చేప‌ట్టాలి

Leave A Reply

Your Email Id will not be published!