Pawan Kalyan : వైసీపీ దుష్ప్రచారం పవన్ ఆగ్రహం
చిల్లర రాజకీయాలు చేస్తే ఒప్పుకోం
Pawan Kalyan : అమరావతి – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యల నుండి దృష్టిని మరల్చేందుకు అధికారంలో ఉన్న వైసీపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.
Pawan Kalyan Serious Comments
తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల మధ్య పొత్తు భగ్నం చేసేందుకు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని , ఇది మంచి పద్దతి కాదని సూచించారు. రాజకీయాలలో ఆరోపణలు, విమర్శలు సర్వ సాధారణమని దానిని పరిగణలోకి తీసుకుని దాడులు చేయడం మానుకోవాలని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.
వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ నేతలు సైతం తమ నోటి దూలను మానుకుంటే బెటర్ అని పేర్కొన్నారు. ప్రత్యేకించి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం వ్యక్తిగత దూషణలకు దిగడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.
ఇలాంటి నోటి దురుసు మాటలకు జన సైనికులు, వీర మహిళా సైనికులు ఎవరూ కూడా ట్రాప్ లో ఇరుక్కోవద్దని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు జనసేన పార్టీ చీఫ్. వ్యక్తిగతంగా ఎంతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ఊరుకోవాలే తప్పా ఎదురు దాడి చేయొద్దని సూచించారు పవన్ కళ్యాణ్.
Also Read : CM Revanth Reddy : రేవంత్ ఢిల్లీ టూర్ పై ఉత్కంఠ