Lay Offs : ఐటీ ఉద్యోగుల‌కు పింక్ స్లిప్ లు

కొత్త ఏడాదిలో కంపెనీలు షాక్

Lay Offs : హైద‌రాబాద్ – ప్రపంచంలో చోటు చేసుకున్న ఆర్థిక మాంద్యం మ‌రింత ఇబ్బందుల‌కు లోను చేస్తోంది. ప్ర‌ధాన రంగాల‌లో టాప్ లో కొన‌సాగుతున్న ఐటీ రంగంలో కీల‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే టెక్నాల‌జీలో అనూహ్యంగా ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ , మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్ , డేటా అన‌లిటిక్స్ , క్లౌడ్ కంప్యూటింగ్ , సాఫ్ట్ వేర్ టెస్ట‌ర్ రావ‌డంతో పెద్ద ఎత్తున జాబ్స్ కోల్పోతున్నారు ఐటీ ఉద్యోగులు. నిన్న‌టి దాకా కంపెనీల‌ను అంటి పెట్టుకుని ఉన్న వీరి నెత్తిమీద పిడుగు ప‌డేలా చేశాయి ఐటీ కంపెనీలు.

Lay Offs Viral in IT Industry

కొత్త సంవ‌త్స‌రంలో సంబురాల‌కు సిద్ద‌మైన వేలాది మంది ఐటీ(IT) నిపుణుల‌కు, జాబ‌ర్స్ కు ఝ‌ల‌క్ ఇచ్చాయి. ప్ర‌స్తుతం ఆర్థిక మాంద్యం ప్ర‌భావం కార‌ణంగా ఆర్థిక రంగం కుదేలైంది. తీవ్ర ఒడిదిడుకుల‌ను ఎదుర్కొంటోంది. వేలాది మంది జాబ్స్ కోల్పోయి రోడ్డున ప‌డ్డారు.

దిగ్గ‌జ కంపెనీలైన అమెజార్, సేల్స్ ఫోర్స్ , ఫ్లిప్ కార్ట్ , ట్విట్ట‌ర్ , గూగుల్ , మైక్రో సాఫ్ట్, స్నాప్ చాట్ , ఆపిల్ త‌దిత‌ర వాటిలో పెద్ద ఎత్తున పింక్ స్లిప్ లు ఇస్తున్నారు. దీంతో బిక్క మొహం వేసుకుంటున్నారు ఐటీ ఎక్స్ ప‌ర్ట్స్.

ఐటీ రంగానికి కేరాఫ్ గా ఉన్న బెంగ‌ళూరు లో ప‌ని చేస్తున్న చాలా మందికి కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చాయి. ఉద్యోగుల‌కు సంబంధించిన వార్షిక వేత‌నాల పెంపు, ప్ర‌మోష‌న్స్ నిలిపి వేయాల‌ని నిర్ణ‌యించాయి.

Also Read : Pawan Kalyan : వైసీపీ దుష్ప్ర‌చారం ప‌వ‌న్ ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!