KKR SQUD IPL 2024 : కప్ పై కన్నేసిన కోల్ కతా
భారీ ధరకు మిచెల్ కొనుగోలు
KKR SQUD IPL 2024 : దుబాయ్ వేదికగా జరిగిన వేలం పాటలో కోల్ కతా నైట్ రైడర్స్(KKR) చరిత్ర సృష్టించింది. వేలం పాటలో ఏకంగా రూ. 24.75 కోట్లతో మిచెల్ స్టార్క్ ను కొనుగోలు చేసింది. ఇది వరల్డ్ క్రికెట్ లో అత్యుత్తమమైన ధరగా రికార్డ్ బ్రేక్ చేసింది.
KKR SQUD IPL 2024 Updates
జట్టులో 10 మంది ఆటగాళ్లను మినీ వేలంలో చేజిక్కించుకుంది. ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహిస్తున్నాడు. ఇందులో రెహమాన్ రూ. 2 కోట్లకు , అట్కిన్సన్ కోటి, సకారియా రూ. 50 లక్షలు, సింగ్ రూ. 20 లక్షలు, భరత్ కు రూ. 20 లక్షలు, రూథర్ ఫోర్డ్ రూ. 1.50 కోట్లు, రఘువంశీ రూ. 20 లక్షలు, పాండే రూ. 50 లక్షలు సాకిబ్ హుస్సేన్ రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది కోల్ కతా నైట్ రైడర్స్.
ఇక జట్టు పరంగా చూస్తే .. అయ్యర్ , రస్సెల్ , గుర్బాజ్ , అనుకూల్ రాయ్ , సరైన్ , అయ్యర్, రానా, నూయుష్ శర్మ, అరోరా, వరుణ్ , స్టార్క్ , రహమాన్ , సకారియా ఆడనున్నారు. ఈసారి ఎలాగైనా సరే ఐపీఎల్ ట్రోఫీ అందు కోవాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు. విచిత్రం ఏమిటంటే మిచెల్ కోసం ఇంత పెద్ద మొత్తంలో ధర వెచ్చించడం ఒకింత ఆశ్చర్యాన్ని కలుగ చేసింది.
Also Read : SRH SQUAD IPL 2024 : బలమైన ఆటగాళ్లతో హైదరాబాద్